లాస్ట్ బంతికి ధోనీ చేసింది కరెక్టేనా?

March 24, 2016 | 05:39 PM | 1 Views
ప్రింట్ కామెంట్
dhoni-bangladesh-last-ball-gloves-t20-niharonline

బంగ్లాదేశ్ తో మ్యాచ్ సందర్భంగా చివరి బాల్ కి టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వ్యవహారం సోషల్ మీడియా క్రికెట్ అభిమానుల్లో పెద్ద చర్చను లేవనెత్తింది. హార్డిక్ పాండ్య చివరి బంతిని సంధించినప్పుడు ధోనీ తన కుడి చేతికున్న గ్లోవ్ ను తీసేశాడు. దీంతో పాండ్య సంధించిన లోబౌన్సర్ ఒడిసి పట్టి బ్యాట్స్ మన్ తో సమానంగా పరిగెత్తి రన్ అవుట్ చేశాడు. ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో పెద్ద చర్చను లేవనెత్తింది.

                            కీపర్ అలా గ్లోవ్ తీసేయొచ్చా? నిబంధనలు అందుకు అంగీకరిస్తాయా? అంటూ పలువురు ప్రశ్నలు సంధిస్తున్నారు. దీనికి కొందరు సమాధానం ఇస్తూ...ధోనీ గ్లోవ్స్ మొత్తం తీసేయలేదని పేర్కొనగా, గ్లోవ్స్ కు సంబంధించిన స్పష్టమైన నిబంధనలు లేవని, రక్షణ కోసం కొన్ని ధరించవచ్చు, సౌకర్యం కోసం తీసేయొచ్చు అని పేర్కొంటున్నారు. అంతిమంగా ఆటగాడి రక్షణే ఆయా వస్తువుల బాధ్యత అని, వాటిని ధరించాలా? తీసేయాలా? అనేది ఆయా ఆటగాడి విచక్షణ అని పలువురు సమాధానం ఇస్తున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ