మెక్ కల్లమ్- ది రియల్ కెప్టెన్

February 25, 2016 | 03:09 PM | 1 Views
ప్రింట్ కామెంట్
mccullum-retirement-special-niharonline

జట్టులో తోటి ఆటగాళ్లలో మేటి లేరు. ఉన్నవారి సహకారం అంతగా లేదు. అయినా సారథిగా అవతలి జట్టుకు తానోక్కడే చుక్కలు చూపించేవాడు. రెక్కలు లేని కివీస్ కు ఆధారంగా నిలిచి జట్టుకు విజయాలను అందించాడు. ఆ ఘనతే ప్రపంచంలో అతన్ని మేటి కెప్టెన్ గా తీర్చిదిద్దింది. అతనే బ్రెండ్ మెక్ కల్లమ్.

మెకల్లమ్‌కు ముందు ఆటలో అనేక మంది గొప్ప బ్యాట్స్‌మెన్ ఉన్నారు. భవిష్యత్‌లోనూ అంతకు మించిన క్రికెటర్లు రావచ్చు. కానీ ఎంత మంది వచ్చినా మెకల్లమ్‌కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఫ్లాట్ వికెట్లపై చెలరేగే ఎంతోమంది హిట్టర్స్... పచ్చటి పిచ్‌పై బంతిని ఆడటానికి భయపడే చోట మెకల్లమ్ విధ్వంసం సృష్టిస్తాడు. అదే అతని గొప్పతనం. ఆఖరికి తన చివరి మ్యాచ్‌లోనూ ఈ స్టార్ క్రికెటర్ అదే చేసి చూపించాడు.

యుద్ధానికి వెళుతున్నప్పుడు తన సైన్యం బలహీనంగా ఉందని తెలిస్తే రాజు ఏం చేయాలి..? ముందే వెళ్లి ప్రత్యర్థులు కోలుకోలేనంతగా వీరవిహారం చే యాలి. మిగిలిన సైన్యానికి పెద్దగా పని లేకుండానే గెలవాలి. మెకల్లమ్ ఎప్పుడూ అదే చేసేవాడు.

అలాంటిది 12 సంవత్సరాల సుదీర్ఘ టెస్టు కెరీర్‌లో మెకల్లమ్ ఒక్క మ్యాచ్ కూడా మిస్ కాలేదు. అరంగేట్రం నుంచి వరుసగా 101 టెస్టులు ఆడిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించి రిటైరయ్యాడు. టెస్టు కెరీర్‌లో 106 సిక్సర్లతో రికార్డు, టెస్టుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ (54 బంతులు) రికార్డులు కెరీర్ చివరి టెస్టులో సాధించాడు. టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన ఏకైక న్యూజిలాండ్ క్రికెటర్ కూడా మెకల్లమే.

కల్లమ్ అంతర్జాతీయ కెరీర్ ముగిసింది. అయితేనేం ఐపీఎల్‌తో సహా అనేక టి20 లీగ్‌లలో కనిపిస్తాడు. కాబట్టి మెకల్లమ్ మెరుపులను మనం ఇంకా పూర్తిగా మిస్ కాలేదు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ