టెస్టుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు

February 20, 2016 | 12:59 PM | 1 Views
ప్రింట్ కామెంట్
mccullum-fastest-test-century-niharonline

కల్లమ్ దెబ్బకి మరో రికార్డు బద్దలైంది. దాదాపు 150 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటిదాకా ఎవరూ నమోదు చేయని ఫీట్ ను ఈ స్టార్ బ్యాట్స్ మెన్ సాధిచి చూపాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు న్యూజిలాండ్ కెప్టెన్ మెకల్లమ్ విజృంభణతో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది.

గతంలో ఈ రికార్డు విండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్, పాక్ ప్లేయర్ మిస్బా ఉల్ హక్ ల పేరిట ఉంది. బ్యాటింగ్ కు దిగగానే ఝుళిపించిన కల్లమ్ కేవలం 54 బంతుల్లో సెంచరీని సాధించాడు. 39 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లైఫ్ లభించగా, ఆపై మెక్ ను ఏ బౌలరూ అడ్డుకోలేకపోయాడు.  16 ఫోర్లు, నాలుగు సిక్స్ ల సాయంతో 12వ టెస్టు సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

ఇక  1986లో వివ్ రిచర్డ్స్ ఇంగ్లాండ్‌పై 56 బంతుల్లో సెంచరీ చేయగా, 2014లో పాకిస్థానీ బ్యాట్స్‌మన్ మిస్బా ఆస్ట్రేలియాపై 56 పరుగుల్లో వంద పరుగులు సాధించాడు. ఇక కల్లమ్ మరో రికార్డును కూడా సాధించాడు. టెస్ట్ ల్లో 100 సిక్స్ లు కొట్టి ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ రికార్డును కూడా మెక్ సమం చేశాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ