కల్లమ్ కల్లోలంకు ఇక విశ్రాంతి

December 22, 2015 | 12:07 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Brendon_McCullum_announced_retirement_niharonline

క్రికెట్ అభిమానులకు, ముఖ్యంగా వీరబాదుడును ఆదరించే అభిమానులకు ఇది షాకిచ్చే వార్తే. బౌలర్లు ఎవరనేది చూడకుండా తన బ్యాటింగ్ విధ్వంసంతో కల్లోలం సృష్టించి ప్రత్యర్థులకు చుక్కలు చూపించే స్టార్ బ్యాట్స్ మెన్ మెక్ కల్లమ్ రిటైర్డ్ మెంట్ ప్రకటించాడు. 34 ఏళ్ల ఈ కివీస్ క్రికెటర్ ప్రస్తుతం ఆ జట్టు కెప్టెన్ గా ఉన్నాడు. శ్రీలంకతో టెస్ట్ సిరిస్ ముగిసిన అనంతరం మీడియా సమక్షంలో బ్రెండన్ మెక్ కల్లమ్ అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో తన సొంత నగరం క్రైస్ట్ చర్చ్ లో జరగనున్న టెస్టే తనకు చివరి మ్యాచ్ (కెరీర్ లో 101టెస్టు) అని ప్రకటించాడు.

ఇక బ్రెండన్ సడెన్ గా తీసుకున్న ఈ నిర్ణయంతో వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ తరఫున అతడి మెరుపు ఇన్నింగ్స్ ను మనం చూడలేం. టెస్టులో ఓ ట్రిబుల్ సెంచరీని నమోదు చేసిన అతడు, టెస్టుల్లో వంద సిక్స్ లు బాది ఆస్ట్రేలియా క్రికెటర్ ఆడం గిల్ క్రిస్ట్ సరసన చేరాడు. అయితే ఐపీఎల్ లో రాజ్ కోట్ తరపున ఎంపికయిన కల్లమ్ అందులో ఆడే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ