పాక్ కి ఓ పూనం పాండే దొరికిందోచ్

March 15, 2016 | 12:44 PM | 3 Views
ప్రింట్ కామెంట్
Qandeel_Baloch_shahid-afridi-strip-dance-niharonline

పూనం పాండే... సోషల్ మీడియాలో ఉండే కుర్రాళ్లకి ఈ పేరు పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. చూసుకోని పండగ చేసుకోండ్రా నాయనా అంటూ తన హాట్ హాట్ ఫోటోలను అప్ లోడ్ చేసి కవ్విస్తుంటుంది. బాలీవుడ్ లో అదృష్టం పరిశీలించుకుందామనుకున్నప్పటికీ అది కాస్త తేడా కొట్టింది. అయితే ఎప్పటి కప్పుడూ వార్తల్లో మాత్రం నిలుస్తూనే ఉంటుంది. అసలు ఆమె హైలెట్ అయ్యింది మాత్రం ఎప్పుడంటే... గతంలో టీమిండియా కప్ గెలిస్తే వారి కోసం నగ్న ప్రదర్శన చేస్తానంటూ ప్రకటించి దేశవ్యాప్తంగా హైలెట్ అయ్యింది. అఫ్ కోర్స్ అది జరగలేదు లేండి. ఇప్పుడు సరిగ్గా ఇలాంటి ప్రకటనే పొరుగున దేశం పాకిస్థాన్ నుంచి వినిపిస్తుంది.

                                   ఐసీసీ టీ20 వరల్డ్ కప్ మెగా టోర్నీలో భాగంగా ఈ నెల 19న కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో టీమిండియా, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో టీమిండియాను ఓడిస్తే... యావత్తు పాక్ ప్రజల ముందు ‘స్ట్రిప్ డ్యాన్స్’ చేస్తానంటూ ఆ దేశానికి చెందిన మోడల్ ఖాందిల్ బాలోచ్ ‘ఘాటు’ ప్రకటన చేసింది. అంతేకాదు ఈ ప్రదర్శనను పాక్ జట్టు కెప్టెన్ షాహిద్ అఫ్రిదీకి అంకితమిస్తానని కూడా ఆమె పేర్కొంది. ఫేస్ బుక్ లో ఓ వీడియో అప్ లోడ్ చేసి మరీ ఈ సంచలన ప్రకటన చేసింది. ఖాందిల్ బాలోచ్ పూనం తరహాలోనే తరచూ హాట్ వీడియోలను, ఫోటోలను అప్ లోడ్ చేసే ఓ మోడల్. ఇంతవరకు ప్రపంచకప్ లలో భారత్ పై గెలవని పాక్ బాలోచ్ ప్రకటనకైనా స్పందిస్తుందా చూద్దాం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ