వాల్ వారసుడు శ(చి)తకొట్టాడు

April 21, 2016 | 05:40 PM | 1 Views
ప్రింట్ కామెంట్
dravid-son-sambit-dravid-ton

ది వాల్ అనగానే టక్కున మనకు గుర్తుచ్చో పేరు మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్. జట్టు విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు వికెట్ పడకుండా కాపాడుకోవడమే కాక.. అత్యంత క్లాసీ షాట్లు ఆడటంలో ద్రవిడ్‌ను మించినవాళ్లు లేరన్నది నిజం. అలాంటి ద్రవిడ్ వారసుడు అచ్చంగా తన తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తున్నాడు. నిండా పదేళ్ల వయసు కూడా నిండకుండానే అండర్ -14 క్లబ్ క్రికెట్‌లో సెంచరీ బాదేశాడు.

                            బెంగళూరు యునైటెడ్ క్రికెట్ క్లబ్ (బీయూసీసీ)కి ప్రాతినిధ్యం వహిస్తున్న సమిత్ ద్రవిడ్.. టైగర్ కప్ క్రికెట్ టోర్నమెంటులో ఫ్రాంక్ ఆంథోనీ పబ్లిక్ స్కూలు జట్టుపై 125 పరుగులు చేశాడు. అందులోనూ 12 బౌండరీలున్నాయి. బీయూసీసీ తరఫునే ఆడుతున్న మరో ఆటగాడు ప్రత్యూష్ 143 నాటౌట్‌గా నిలిచాడు. వీళ్లిద్దరూ చెలరేగడంతో బీయూసీసీ జట్టు 246 పరుగుల భారీ తేడాతో గెలిచింది. అన్నట్లు సమిత్ ద్రావిడ్ ఇలా చెలరేగి ఆడటం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో అండర్ -12 గోపాలన్ క్రికెట్ చాలెంజ్ టోర్నమెంటులో అతడు బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా ఎంపికయ్యాడు. అప్పుడు వరుసగా 77 నాటౌట్, 93, 77 చొప్పున పరుగులు చేసి, తన జట్టును గెలిపించాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ