రవిశాస్త్రి ఫుల్ క్లాస్ పీకాడు

February 23, 2016 | 01:51 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Ravi Shastri warns India will not take Bangladesh lightly niharonline

బంగ్లాదేశ్ జట్టును తక్కువగా అంచనా వేయరాదని టీమిండియాను జట్టు డైరెక్టర్ రవిశాస్త్రి హెచ్చరించాడు. పాక్, లంక బలమైన జట్టు అయినప్పటికీ బంగ్లాను తేలికగా తీసిపారేయోద్దని టీమిండియాకు చురక అంటించాడు. గత కొన్నేళ్లుగా బంగ్లాను గమనిస్తున్నాను.. వారి ప్రదర్శన చాలా మెరుగైందని ఆసియా కప్ కి సన్నద్ధమౌతున్న ఆటగాళ్లకు సలహా ఇస్తున్నాడు. గెలవడం అలవాటుగా మార్చుకోవాలంటూ టీమిండియా ఆటగాళ్లకు సూచించాడు.

                           ఓ ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ..  ప్రతిసారీ ఆఖర్లో పోరాటం చేయడమే కాదు ఆరంభం నుంచే దూకుడుగా ఇన్నింగ్ మొదలెట్టాలని ఆటగాళ్లను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. ఎలాంటి పిచ్ లు తయారుచేసిన వెనకంజ వేయరాదని, గెలవాలన్న కసితో క్రికెట్ ఆడటం మీ పని అన్నాడు. కేవలం ప్రత్యర్థి జట్లు మాత్రమే మారతాయంటూ ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నింపేలా మాట్లాడాడు. బంగ్లా జట్టు చాలా మెరుగైందిని గతంలో ఆ జట్టు చేతిలో వారి దేశంలో 1-2 తేడాతో వన్డే సిరీస్ పరాజయాన్ని ఈ సందర్భంగా టీమ్ ఆయన గుర్తుచేశాడు.  

ఆసియా కప్ లో భాగంగా భారత్ తమ తొలి మ్యాచ్ ఆతిథ్య బంగ్లా జట్టుతో ఆడనుంది. ఆస్ట్రేలియాపై 3-0తో క్లీన్ స్వీప్, శ్రీలంకపై 2-1తో విజయంతో భారత్ చాలా జోష్ లో ఉన్నట్లు కనిపిస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ