రోహి(త్)ట్ కు ఐసీసీ విషెస్

April 30, 2016 | 03:51 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Happy-Biarthday-Rohit-Sharma-29th-niharonline

టీమిండియా స్టైలిష్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ నేటితో 29 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లో తనకంటూ ఓ గుర్తింపును రోహిత్ సాధించాడు. ఆరంభంలో నిలకడ లేమితో సతమతమైన రోహిత్, ఆ తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకుని రీఎంట్రీ ఇచ్చిన తర్వాత సత్తా చాటాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ చరిత్రలోనే ఏ ఒక్కరికీ సాధ్యం కాని ఫీట్ ను అతడు సాధించాడు. వన్డే క్రికెట్ లో ఏకంగా రెండు డబుల్ సెంచరీలు నమోదు చేసిన అతడు... వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డు(264)ను తన పేరిట లిఖించుకున్నాడు. అందుకే... భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)తో పాటు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కూడా రోహిత్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన బర్త్ డే విషెస్ లో ఐసీసీ... రోహిత్ ను ఆకాశానికెత్తేసింది. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన క్రికెటర్ గానే కాక తక్కువ సమయంలోనే 5 వేల పరుగుల మైలురాయిని అధిగమించాడని అతడిని ఐసీసీ కీర్తించింది. తన మేనేజర్, స్నేహితురాలు రితికను గతేడాది వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ