ఐసీసీ కోసమే రాజీనామా డ్రామా!

May 10, 2016 | 05:54 PM | 1 Views
ప్రింట్ కామెంట్
shashank_manohar_quits_BCCI_chairman_niharonline

బీసీసీఐ అధ్య‌క్ష ప‌ద‌వికి శశాంక్ మనోహర్ గుడ్ బై చెప్పారు. దాల్మియా ఆకస్మిక మృతితో ఏడాది క్రితం బోర్డు అధ్యక్షుడిగా ఎంపికైన శశాంక్ మనోహర్, తక్కువ వ్యవధిలోనే బీసీసీఐలో ఎన్నో సంస్కరణలు తీసుకు వచ్చి మంచి పేరు తెచ్చుకున్నారు. గత కొన్ని నెలలుగా బీసీసీఐ అధ్య‌క్ష ప‌ద‌వికి ఆయన రాజీనామా చేస్తారనే వార్తలు వస్తూనే ఉన్నాయి. లోధా క‌మిటీ సూచించిన సంస్క‌ర‌ణ‌ల అమ‌లుపై ప‌లుసార్లు సుప్రీంకోర్టు బీసీసీఐని ప్ర‌శ్నించిన సంగ‌తి తెలిసిందే. అయితే లోధా కమిటీ తీర్పుపై ఆయన అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు జూన్‌లో ఐసీసీ ఛైర్మ‌న్ ప‌ద‌వికి పోటీ చేయాల‌ని శ‌శాంక్ మ‌నోహ‌ర్ భావిస్తున్నారు. ఐసీసీ ఛైర్మ‌న్ ప‌ద‌వి రేసులోకి దిగాలంటే బీసీసీఐ అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి శ‌శాంక్ మ‌నోహ‌ర్ వైదొలగాల్సిందే. దీంతో ఐసీసీ ఛైర్మ‌న్ ప‌ద‌వి వైపుకే ఆయన మొగ్గు చూపారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ