ఓడినా దాదా ప్రశంసలు దక్కాయి

January 13, 2016 | 05:14 PM | 1 Views
ప్రింట్ కామెంట్
sourav-ganguly-rohit-sharma-perth-ODI-niharonline

పెర్త్ వన్డేలో ఓటమిపాలైనప్పటికీ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ కి ప్రశంసలు దక్కుతున్నాయి. ప్రపంచంలో అత్యుత్తమ టాప్ ఆర్డర్ బ్యాట్స్ మన్ టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అని మాజీ క్రికెటర్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రశంసించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో తొలి మ్యాచ్ ఓటమిపై మాట్లాడుతూ, ఓటమి టీమిండియాను బాధించి ఉంటుందని అన్నాడు. ఈ వన్డే ద్వారా బరిందర్ రూపంలో టీమిండియాకు మంచి బౌలర్ దొరికాడని వ్యాఖ్యానించాడు. మ్యాచ్ మొత్తం చూశానని చెప్పిన దాదా, రోహిత్ విధ్వంసకర బ్యాటింగ్ బాగుందని చెప్పాడు. ఏ క్షణంలో అయినా మ్యాచ్ స్వరూపం మార్చగల సత్తా రోహిత్ శర్మ సొంతమని దాదా అభిప్రాయపడ్డాడు. అయితే టెస్ట్ ల్లో కూడా రోహిత్ ఆడితే బావుంటుందని దాదా అభిప్రాయపడ్డాడు. ఇక టీమిండియా భారీ స్కోరు సాధించినా ఓటమిపాలవ్వడం ఆటగాళ్లను నిరాశకు గురి చేసి ఉంటుందని గంగూలీ చెప్పాడు. మనోధైర్యంతో రెండో వన్డేకు సిద్ధం కావాలని ఆటగాళ్లకు ఆయన సూచించాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ