సచిన్ సెన్సేషనల్ కామెంట్లు

January 04, 2016 | 12:53 PM | 2 Views
ప్రింట్ కామెంట్
Tendulkar-young-cricketers-about-T20-niharonline

క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ప్రస్తుతం రాజకీయాల్లో (రాజ్యసభ సభ్యుడిగా) బిజీ అయిపోయాడు. నియోజకవర్గ సమస్యల దృష్ట్యా ఒత్తిళ్లు రావటంతో బరిలోకి దిగారు. అయితే అదే టైంలో క్రీడాకారులకు శిక్షణ ఇచ్చే అకాడమీలకు మాత్రం రెగ్యులర్ గా హాజరవుతూ వస్తున్నారు. ఈ సందర్భంగా ఓ అకాడమీ లో కార్యక్రమానికి హాజరైన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు.  

క్రికెట్ ను అమితంగా ఇష్టపడే యువతకెరీర్ లో ఉన్నత స్థాయికి చేరాలంటే టీ-20పై మక్కువ పెంచుకోవద్దని, 'తుపాను' వంటి ఈ పరిమిత ఓవర్ల క్రికెట్ కు దూరంగా ఉండాలని సూచించారు. పొట్టి క్రికెట్ ను నమ్మితే, కెరీర్ ప్రమాదంలో ఉన్నట్టేనని అన్నారు. ముంబై అండర్-16 క్రికెటర్లతో సమావేశమైన సచిన్, యువకులకు కొన్ని సలహాలు ఇచ్చారు. ఎవరినో చూసి కాపీ కొట్టవద్దని అన్నారు. అసలు టీ20 షాట్లను లైట్ తీసుకోవాలని, అవి వంట పట్టించుకుంటే గనక కెరీర్ పనికిరాకుండా పోతుందని హెచ్చరించాడు.  ఈ సమావేశంలో సచిన్ తనయుడు అర్జున్ కూడా పాల్గొన్నాడు. కాగా, సచిన్ ఓకే ఒక్క ఇంటర్నేషనల్ టీ-20ని ఆడిన సంగతి తెలిసిందే. 2006లో జొహానస్ బర్గ్ లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఈ మ్యాచ్ లో కేవలం 10 పరుగులు మాత్రమే చేసిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ