బాధ్యతలు పెరుగుతున్నాయ్... అందుకే బ్రేకప్

February 09, 2016 | 11:58 AM | 2 Views
ప్రింట్ కామెంట్
The real reason why Virat Kohli Anushka Sharma relation split niharonline

పెళ్లి పీటలు ఎక్కాల్సిన సెలబ్రిటీ జంట నిర్దాక్షిణ్యంగా విడిపోయారన్నది సంగతి తెలిసిందే. ఓ యాడ్ సందర్భంగా కలిసిన ఈ యువజంట మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఆపై ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. కోహ్లీ ఫాంపై విమర్శలు వచ్చిన సమయంలో అనుష్క అతనికి అండగా నిలిచింది. అయితే ఏం జరిగిందో తెలీదుగానీ అనుకుంటున్న సమయంలో విడిపోవడానికి గల కారణం దొరికింది.

ప్రస్తుతం టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం తన కెరీర్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ పరిమిత ఓవర్ల క్రికెట్ కు కూడా వీడ్కోలు చెబితే, టీమిండియా మూడు ఫార్మాట్ల జట్టు నాయకత్వ బాధ్యతలు అతడికే దక్కనున్నాయి. మరోవైపు ఇక బాలీవుడ్ లో తాను నటిస్తున్న చిత్రాలు వరుసగా హిట్ అవుతుండటంతో అనుష్క శర్మ కూడా తన రెరీర్ లో దాదాపు కీలక దశలో ఉంది.

దీంతో తమ తమ రంగాల్లో అత్యున్నత స్థితిలో ఉన్న వీరిద్దరూ పెళ్లి చేసుకుని తమ కెరీర్లను నాశనం చేసుకునేందుకు ఇష్టపడటం లేదట. ఈ క్రమంలోనే కోహ్లీ ప్రతిపాదించిన పెళ్లి ప్రపోజల్ ను అనుష్క తిరస్కరించిందట. ఆ తర్వాత కోహ్లీ కూడా కాస్తంత లోతుగానే ఆలోచించి ప్రేమ, పెళ్లిలను పక్కనబెట్టేశాడు. బ్రేకప్ కు సంబంధించి వారిద్దరూ తమ సన్నిహితుల వద్ద బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నట్లు భోగట్టా.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ