మరో వివాదంలో పాక్ ఆటగాడు

April 26, 2016 | 03:31 PM | 1 Views
ప్రింట్ కామెంట్
kamran-akmal-theatre-brawl-niharonline

పాక్ స్టార్ బ్యాట్స్ మెన్ ఉమర్ అక్మల్  మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. ఓ థియేటర్ లో జరిగిన ఘర్షణలో అతనితోపాటు మరో నలుగురు జాతీయ స్థాయి క్రికెటర్లపై పీసీబీ విచారణకు ఆదేశించింది. ఫైసలాబాద్ లోని ఓ థియేటర్ లో ఆదివారం రాత్రి జరిగిన డ్రామా షోకు అక్మల్, మరో నలుగురు క్రికెటర్లు హాజరయ్యారు. అయితే డ్రామాలో ఓ యువతి చేసిన నృత్యాన్ని మరోసారి చేయాలంటూ వీరు డిమాండ్ చేశారు. దీనికి థియేటర్ యాజమాన్యం నిరాకరించింది. దీంతో వారితో ఘర్షణకు దిగారు. అక్మల్ తో పాటూ క్రికెటర్లు అవాసిస్ జియా, బిల్ వాల్ బట్టి, మహ్మద్ నవాజ్, షాహిద్ యుసుఫ్ లు ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో పాక్ టీవీ చానళ్లలో చక్కర్లు కొట్టడంతో అక్మల్ వివరణ ఇచ్చుకున్నాడు.

'నా వ్యక్తిగత జీవతం వేరు, క్రికెట్ వేరు. అనవసరంగా చిన్న విషయాన్ని రాద్దాంతం చేస్తున్నారు. వినోదం కోసం మాత్రమే ఆ థియేటర్‑లో డ్రామా చూడటానికి వెళ్లాను.అదేం తప్పు కాదు. క్రికెటర్ వ్యక్తిగత జీవితాన్ని హైలెట్ చేసి చూడకూడదు' అని పేర్కొన్నారు. అయితే ఇంతకు ముందుకూడా ఉమర్ అక్మల్ రెడ్ సిగ్నల్ పడినా.. దాటుకుని పోవడమే కాకుండా.. ట్రాఫిక్ పోలీసులతో వాదనకు దిగి, వివాదంలో చిక్కుకున్నాడు. తాజా ఆరోపణలతో పీసీబీ విచారణకు ఆదేశించటంతో అతని కెరీర్ పై కాస్త నీలినీడలు కమ్ముకున్నాయి. ఆరోపణలు రుజువైతే రెండు నుంచి ఐదేళ్లపాటు బ్యాన్ పడే అవకాశం ఉంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ