ధోనీ కంటే కోహ్లీనే ఎక్కువ వాడుకుంటున్నారు

March 24, 2016 | 11:18 AM | 1 Views
ప్రింట్ కామెంట్
dhoni-kohli-kit-earnings-niharonline

టీమిండియా కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ క్రికెటర్లలో అత్యధిక ఆదాయం సంపాదించే ఆటగాడిగా ఉన్నాడు. ఫాంలేమి ఉన్నప్పటికీ ఇతర క్రికెటర్ల కంటే ధోనీపైనే వాణిజ్య కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. అయితే టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ ఆర్జనలో ధోనీ రికార్డును బద్ధలు కొట్టేశాడు. ఆగండి... ఆగండి... మొత్తం ఆదాయంలో కాదులేండి. బ్యాటు, బూట్లు ఇతర కిట్ వస్తువులపై ఆయా వ్యాపార సంస్థల గుర్తులకు చోటిచ్చిన ధోనీ అందుకు గాను ఏటా రూ.6 కోట్లు ఆర్జిస్తుంటే, కోహ్లీ మాత్రం అదనంగా మరో రూ.4 కోట్లు జేబులో వెనకేసుకుంటూ మొత్తం రూ.10 కోట్లు ఆర్జిస్తున్నాడు.

                      తన బ్యాట్ పై ఎంఆర్ఎఫ్ కంపెనీ ముద్రకు అనుమతిచ్చిన కోహ్లీ కేవలం అందు కోసమే రూ.8 కోట్లు తీసుకుంటున్నాడట. ఇక బూట్లతో పాటు కిట్ లోని ఇతర వస్తువులపై మిగతా రూ.2 కోట్లు ఆర్జిస్తున్నాడు. వెరసి కోహ్లీ ‘కిట్’ ఆదాయం రూ.10 కోట్లకు చేరింది. ఇక ‘కిట్’ ఆదాయానికి సంబంధించి ఇతర క్రికెటర్ల విషయానికొస్తే యువరాజ్ సింగ్ రూ.4 కోట్లు, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ లు రూ.3 కోట్ల చొప్పున, ఏబీ డివిలియర్స్ రూ.3.5 కోట్లు, క్రిస్ గేల్ రూ.3 కోట్ల మేర ఆర్జిస్తున్నారు.

ఓవరాల్ గా సంపాదనలో ధోనీనే టాప్ పొజిషన్ లో ఉన్నా ‘కిట్’ ఆదాయంలో మాత్రం కోహ్లీని కొట్టేవారు మాత్రం లేరన్నది తేలిపోయింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ