ఐపీఎల్ వేలంలో టాప్ వాట్సన్, యూవీ!

February 06, 2016 | 02:18 PM | 4 Views
ప్రింట్ కామెంట్
IPL-auction-2016-watson-yuvi-niharonline

ఐపీఎల్-2016 వేలం ఆరంభం అదిరింది. షేన్ వాట్సన్, యువరాజ్ సింగ్, ఇషాంత్ శర్మ, కెవిన్ పీటర్సన్ వంటి ప్లేయర్లకు భారీ ఆఫర్లు వచ్చాయి. పూణే సూపర్ జెయింట్స్, గుజరాత్ లయన్స్ బలోపేతం కావాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్‌కు స్టార్స్ కలిసొచ్చాయి. బేస్ రేటు రూ.2 కోట్లు ఉన్న వాట్సన్‌ను రూ.9.5 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది.

                     యువరాజ్ సింగ్‌ గత ఏడాది వేలంలో అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా నిలిచాడు. అతన్ని ఈ ఏడాది రూ.7 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. ఇటీవలే ముగిసిన బిగ్ బ్యాష్ లీగ్‌లో దుమ్ము రేపిన పీటర్సన్‌ను పూణే సూపర్‌జెయింట్స్ రూ.3.5 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది. పూణే ఫ్రాంఛైజ్ కళ్లు ఇషాంత్ శర్మ మీద పడ్డాయి. రూ.3.8 కోట్లు చెల్లించి ఇషాంత్‌ను తమ జట్టులోకి రాబట్టుకున్నారు. బాల్‌తో వీర విహారం చేసే అశిష్ నెహ్రా కోసం కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, సన్‌రైజర్స్ హైదరాబాద్ గట్టిగా తలపడ్డాయి. అశిష్ చివరికి రూ.5.5 కోట్లకు సన్‌రైజర్స్ వశమైపోయాడు.

షేన్ వాట్సన్‑ (రూ. 9.5 కోట్లు): రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

యువరాజ్ సింగ్ (రూ. 7 కోట్లు):సన్ రైజర్స్ హైదరాబాద్

 దినేశ్ కార్తీక్‑ (రూ. 2.3 కోట్లు): గుజరాత్ లయన్స్

కెవిన్ పీటర్సన్ (రూ. 3.5 కోట్లు): పుణె సూపర్ జెయింట్స్

ఇషాంత్ శర్మ (రూ. 3.8 కోట్లు): పుణె సూపర్ జెయింట్స్

ఆశీష్ నెహ్రా (రూ. 5.5 కోట్లు): సన్ రైజర్స్ హైదరాబాద్

డేల్ స్టెయిన్ (రూ. 2.3 కోట్లు): గుజరాత్ లయన్స్

జోస్ బట్లర్ (రూ. 3.8  కోట్లు): ముంబై ఇండియన్స్

సంజూ శామ్సన్ (రూ. 4.2 కోట్లు): ఢిల్లీ డేర్ డెవిల్స్

ఇర్ఫాన్ పఠాన్(కోటి): పుణె సూపర్ జెయింట్స్

క్రిస్ మోరిస్ (రూ. 7 కోట్లు): ఢిల్లీ డేర్ డెవిల్స్

స్టువర్ట్ బిన్నీ (రూ.2 కోట్లు): రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

మిచెల్ మార్ష్ (రూ. 4.8 కోట్లు): పుణె సూపర్ జెయింట్స్

ధవళ్ కులకర్ణి (రూ. 2 కోట్లు): గుజరాత్ లయన్స్

ప్రవీణ్‌ కుమార్ (రూ.3.8 కోట్లు): గుజరాత్ లయన్స్

మోహిత్ శర్మ (రూ.  6.5 కోట్లు): కింగ్స్ లెవెన్ పంజాబ్

టిమ్ సౌథీ (రూ.2.5 కోట్లు): ముంబై ఇండియన్స్.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ