సిరీస్ పై సుష్మా సీరియస్ వార్నింగ్

December 12, 2015 | 01:05 PM | 1 Views
ప్రింట్ కామెంట్
sushma-swaraj-on-indo-pak-series-niharonline

పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ), భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)ల మధ్య గతేడాది ఒప్పందమైతే కుదిరింది కానీ, అది కార్యరూపం దాల్చలేదు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సిరీస్ జరగటం కష్టమే అనుకున్న టైంలో ఇరు దేశాల ప్రతినిధులు చర్చలకు దిగటంతో ఫ్యాన్స్ అంతా సంబరాలు చేసుకున్నారు. అంతేకాదు ఈ నెల 24 నుంచి సిరీస్ మొదలౌతోందని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఉత్త హుళక్కేనని ఇప్పుడు సంకేతాలు అందుతున్నాయి. దీనికి కారణం విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్మరాజ్ తాజా వ్యాఖ్యాలే.

సిరీస్ నిర్వహాణకు పాక్ ప్రభుత్వం, పీసీబీకి ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇక తన జట్టును పంపేందుకు బీసీసీఐ కూడా సిద్ధంగానే ఉన్నా, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉంది. అయితే భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ మూడు రోజుల క్రితం నేరుగా పాక్ రాజధాని ఇస్లామాబాదు వెళ్లారు. అక్కడ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో పాటు ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి సర్తాజ్ అజీజ్ తోనూ భేటీ అయ్యారు.

ఇరు దేశాల మధ్య సంబంధాలు, ఇరువురి మధ్య పరిష్కారానికి నోచుకోకుండా ఉన్న పలు అంశాలతో పాటు క్రికెట్ అంశం కూడా ఈ భేటీలో చర్చకు వచ్చింది. దీనిపై సుష్మా స్వరాజ్ ఇప్పటిదాకా నోరు విప్పలేదు. అయితే సిరీస్ పై చర్చ జరిగిందని సర్తాజ్ శుక్రవారం అక్కడి మీడియాతో చెప్పారు. ‘‘సంబంధాలు బలపడితేనే, క్రికెట్ సహా అన్ని విషయాల్లోనూ ముందుకు వెళ్లే వీలు ఉంటుంది’’ అని సుష్మా కాస్త సీరియస్ గానే చెప్పారని తెలుస్తోంది. అంటే సిరీస్ ఇప్పట్లో జరగటం అనేది అనుమానంగానే కనిపిస్తోంది. ఈ సిరీస్ గనక జరగకపోతే పాక్ బోర్డుకి దాదాపు 325 కోట్లు నష్టం వాటిల్లే అవకాశం ఉందని సమాచారం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ