రాళ్లుపడతాయని భయపడుతున్నారంట

March 11, 2016 | 03:27 PM | 1 Views
ప్రింట్ కామెంట్
pak-fears-to-play-eden-niharonline

వరల్డ్ కప్ టీ-20 పోటీల్లో పాకిస్థాన్ జట్టు పాల్గొనే విషయమై సందిగ్ధత ఇంకా తొలగలేదు. ప్రస్తుతానికి తమ జట్టు ప్రయాణానికి అనుమతి ఇచ్చే పరిస్థితి లేదని పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల శాఖా మంత్రి చౌధురి నిసార్ అలీ ఖాన్ మీడియాకు వెల్లడించారు. తమ ఆటగాళ్ల భద్రతపై భారత్ నుంచి తాము లిఖితపూర్వక సమాచారాన్ని కోరుతున్నట్టు ఆయన తెలిపారు.

                 "భయాందోళనల మధ్య ఆట సాగదు. ఈడెన్ గార్డెన్స్ లో లక్ష మంది వరకూ అభిమానులు ఉంటారు. రాళ్లు ఏ వైపు నుంచి వచ్చి పడతాయో చెప్పలేం. ఇరు జట్లూ సమాన అవకాశాల మధ్య ఆడాలన్నదే మా డిమాండ్" అన్నారు.  వాస్తవానికి ఇప్పటికే పాక్ జట్టు భారత్ కు చేరుకోవాల్సి వుండగా, మెలిక మీద మెలిక పెడుతున్న ఆ దేశం జట్టు ప్రయాణాన్ని ఏరోజు కారోజు వాయిదా వేస్తూ వస్తోంది. ధర్మశాల భద్రతపై అనుమానం వ్యక్తం చేయటంతో ఈడెన్ గార్డెన్స్ కి మార్చిన సంగతి తెలిసిందే. ఇక దీనిపై కూడా పాక్ రాద్ధాంతం చేయటం విడ్డూరంగా ఉంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ