ఇప్పుడు యువీ ఖచ్ఛితంగా అవసరం

December 18, 2015 | 12:51 PM | 2 Views
ప్రింట్ కామెంట్
Yuvraj Singh peaking at right time niharonline

విధ్వంసకర బ్యాట్స్ మెన్, చిరుతలా మైదానంలో కదిలే మెరుపు ఫీల్డర్, నాణ్యమైన స్పిన్ బౌలర్ వెరసి టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన ఆటగాడు యువరాజ్ సింగ్. భారత జట్టు టీ20 కప్ గెలిచిందన్నా, సుదీర్ఘ సమయం తర్వాత ప్రపంచకప్ ను ఎత్తుకుందన్నా అది యువీ చొరవే. మరి ప్రస్తుతం అతని స్థానం ఎక్కడ ఉంది? కాన్సర్ ను సైతం జయించి, ప్రత్యర్థులకు చుక్కలు చూపించే ఈ ముఖ్యఆటగాడిని ఎందుకు సెలక్ట్ చేయట్లేదు? అన్నదే ఇప్పుడు ప్రశ్న. నిజానికి యువీ అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడి రెండేళ్లు గడిచింది. టెస్ట్ లకు దూరమై మూడేళ్లయ్యింది. పొట్టి ఫార్మట్ లో బ్యాట్ ఝుళిపించి ఏడాదిన్నది గడుస్తుంది. పోనీ ఫామ్ లో లేడా అంటే అదీ కాదు. దేశీవాళీ క్రికెట్ లో ఆడుతూ అదరగొడుతూ వస్తున్నాడు. మరి అలాంటి స్టార్ బ్యాట్స్ మెన్ సీనియర్ అనే ఒకే ఒక కారణంగా పూర్తిగా పక్కన పెడుతున్నారు. పూర్తిగా యువరక్తంతోనే ఆటను కానిచ్చేద్దామనకుంటున్న బీసీసీఐ ఆలోచన ఎన్నోసార్లు బెడిసి కొట్టింది. ఈ మధ్య స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్ లోనూ అదే రిపీట్ అయ్యింది కూడా. మరి ఇలాంటి పరిస్థితుల్లో యువీ లాంటి అనుభవజ్నుడైన ఆటగాడి అవసరం ఖచ్ఛితంగా ఉంటుంది.

                                    త్వరలో ఆస్ట్రేలియా సిరీస్ ఉండటం, పైగా టీ20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో యువరాజ్ సింగ్ ను ఎంపిక చేయాలనే నినాదం ఊపందుకుంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం అందరూ యువీకి మద్ధతే. ప్రస్తుతం హాజారే ట్రోఫీలో అర్థ శతకాలతో అదరగొడుతున్న యువీ త్వరలో మరో రెండు చిన్నాచితకా టోర్నీల్లో కూడా ఆడనున్నాడు. అందులో కూడా రాణిస్తే యువీ స్థానం కన్ఫర్మ్ అయినట్లే. ఇక  ప్రస్తుతం జట్టులో నాణ్యమైన ఆల్ రౌండర్ లేకపోవటం యువరాజ్ కి కలిసొచ్చే అంశం. చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ప్రాణం... భారత జట్టులో ఛాన్స్ వస్తే గౌరవంగా భావిస్తాను, పునరాగమనం కోసం కృషి చేస్తున్నాను అంటూ యువీ తన 34 వ పుట్టినరోజు సందర్భంగా ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. మరీ స్టార్ ఆటగాడు తిరిగి టీమిండియాలో చోటుదక్కించుకోవాలని మనస్ఫూర్తిగా కొరుకుందాం.     

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ