అప్రిదీకి నోటి దూల చాలా ఎక్కువ కానీ...

December 11, 2015 | 04:23 PM | 2 Views
ప్రింట్ కామెంట్
yuvraj-singh-about-shahid-afridi-niharonline

రెండు దేశాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇంక క్రికెట్ లో అయితే దాయాదుల పోరు వస్తుందంటే చాలు అభిమానులకు ఎక్కడ లేని కిక్కు వస్తుంది.  మొన్నామధ్య జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ ను దాదాపు 130 కోట్ల మంది వీక్షించారంటే అర్థం చేసుకోవచ్చు. మరి అలాంటి దేశాల మధ్య త్వరలో తిరిగి సిరీస్ ప్రారంభం కానుందనే వార్త ఫ్యాన్స్ కి తీపివార్తే కదా. ఈ నేపథ్యంలో భారత స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ పాకిస్థాన్ ఆటగాడు షాహిద్ అఫ్రిదీపై వ్యాఖ్యలు చేశాడు.

తాను టీమిండియాకు ఆడినప్పుడు పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదీ తనపై చాలా సార్లు నోరు పారేసుకున్నాడని, నోటి దూల అఫ్రిదీకి అలవాటేనని యూవీ అన్నాడు. అయితే అఫ్రిదీ దూషణలను తీవ్రంగా తీసుకోవద్దని, ఆఫ్రిదీ బయటకు చాలా కఠినంగా కనిపిస్తాడు గానీ లోపల చాలా మెత్తని మనిషి అని యువీ కితాబిచ్చాడు.

ఐపీఎల్ తరహాలో పీసీబీ ప్రారంభించిన పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)కు మద్దతుగా నిర్వహించిన వీడియో షోలో యువీ తన వీడియో సందేశం తెలిపాడు. అఫ్రిదీ సోదరుడు యజమానిగా ఉన్న పెషావర్ జట్టుకు మద్దతుగా యువీ అందులో మాట్లాడాడు. షాహిద్ అఫ్రిదీ ఉన్న జట్టు తప్పకుండా బాగా ఆడుతుందని ఆయన అన్నాడు. కేవలం ఆఫ్రిదీ ఉండడం వల్లనే తాను ఆ జట్టుకు మద్దతు ఇస్తున్నానని యువీ తెలిపాడు. ఆఫ్రిదీ బాదే సిక్స్ లు అద్భుతంగా ఉంటాయని, ఓసారి అటూ ఓసారి ఇటూ సిక్స్ లు బాదుతుంటుంటే చూడటానికి బావుంటుందని చెప్పాడు. కాగా, పాకిస్తాన్, భారత్ మధ్య క్రికెట్ సిరీస్ సందేహంలో పడిన నేపథ్యంలో యువీ చేసిన ఈ  స్నేహపూర్వకరమైన వ్యాఖ్యలకు ప్రశంసలు లభిస్తున్నాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ