అది తలుచుకుని ఇప్పటికీ బాధపడుతున్నా!

December 26, 2015 | 01:00 PM | 4 Views
ప్రింట్ కామెంట్
Yuvraj-Singh-about-come-back-australia-series-niharonline

రెండు ప్రపంచకప్ లను అందించిన స్టార్ ఆటగాడు ఇన్నాళ్లు ఆటకు దూరమవ్వటం అతనికే కాదు, అతనంటే పడిచచ్చే ఫ్యాన్స్ కి బాధకరమే. అయితే ఫామ్ లోకి తిరిగి రావటంతో తిరిగి జట్టులో చోటు సాధించాడు సీనియర్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్. పునరాగమనంపై మీడియాతో మాట్లాడుతూ... ఫిట్ నెస్ కోసం తాను చాలా కష్టపడ్డానని, దాని ఫలితం తప్పకుండా వస్తుందని యువీ ధీమా వ్యక్తం చేశాడు. వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో జరగనున్న సిరీస్ లో తన సత్తా చాటుతానని అన్నాడు. బీసీసీఐ టీవీతో యువరాజ్ మాట్లాడుతూ, టీమిండియాలోకి తిరిగి రావడంపై తనకు సంతోషంగా ఉందన్నాడు. క్రికెట్ ను ఆస్వాదించినంత కాలం తాను కొనసాగుతానని యువీ గతంలో చెప్పిన విషయాన్నే మరోసారి గుర్తు చేశారు. సాధ్యమైనంత వరకు ఎక్కువ ట్వంటీ 20 మ్యాచ్ లు తాను ఆడాలనుకుంటున్నానన్నారు. 2007లో ట్వంటీ 20 వరల్డ్ కప్ భారత్ గెలుచుకున్న క్షణాలను ఆయన గుర్తుచేసుకున్నారు. గత ఏడాది ట్వంటీ 20 వరల్డ్ కప్ ఫైనల్ లో తన ఆటతీరు పరమ చెత్తగా ఉందని, అది తలచుకుని ఇప్పటికీ బాధపడుతున్నానని యువీ పేర్కొన్నాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ