మూడో రోజూ అదే అంతరాయం... రహానే సెంచరీ మిస్

June 12, 2015 | 06:27 PM | 0 Views
ప్రింట్ కామెంట్
ajinkya_rahane_fatullah_test_century_miss_niharonline

ఫతుల్లా టెస్ట్ మ్యాచ్ కూ మూడో రోజూ వర్షం అంతరాయం కలిగించింది. భారత్, బంగ్లాదేశ్ మధ్య మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్ లో 6 వికెట్లు కోల్పోయి 462 పరుగులు చేసింది. ఓపెనర్లు శిఖర్ ధావన్(173), మురళీ విజయ్(150) సెంచరీలు చేశారు. అజింక్య రహానే తృటిలో సెంచరీ కోల్పోయాడు. 103 బంతుల్లో 14 ఫోర్లతో 98 పరుగులు చేసి అవుటయ్యాడు. రోహిత్ శర్మ(6), కోహ్లి(14), సాహా(6) విఫలమయ్యారు. అశ్విన్(2), హర్భజన్(7) క్రీజ్ లో ఉన్నారు. బంగ్లా బౌలర్లలో షకీబ్ 4 వికెట్లు పడగొట్టాడు. జుబేర్ హుస్సేన్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. భోజన విరామం తర్వాత నాలుగుసార్లు ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో పలుమార్లు ఆట నిలిచిపోయింది. చివరికి పది ఓవర్లు ఉండగానే మ్యాచ్ ను ముగించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ