మిస్టర్ డిపెండబుల్ కి నచ్చిందే దొరికిందట

June 08, 2015 | 05:28 PM | 1 Views
ప్రింట్ కామెంట్
dravid_happy_over_board_decision_junior_under_19_players_coach_niharonline

రాహుల్ ద్రావిడ్... మిస్టర్ డిపెండబుల్, గ్రేట్ వాల్ ఆఫ్ టీమిండియా. భారత్ క్రికెట్ చరిత్రలో ఓ అద్భుతం. ఎన్నో మ్యాచ్ లను ఒంటి చేత్తో గెలిపించిన అనుభవశాలి. అలాంటి వ్యక్తిని సలహా కమిటీలో నియమించకపోవటంపై తీవ్ర విమర్శలు వెలువెత్తాయి. అయితే వాటన్నింటినీ పక్కన బెడుతూ బీసీసీఐ ఆయనను భారత్-ఏ, అండర్-19 కోచ్ గా నియమించింది. మరి అది ద్రావిడ్ కి సంతృప్తినిచ్చిందా?. అవుననే అంటున్నాడు ద్రావిడ్. తనకిష్టమైన పనినే బీసీసీఐ తనకు కట్టబెట్టిందని చెప్పుకొచ్చాడు. త్రిసభ్య కమిటీలో పనిచేసేందుకు ఇష్టపడని ద్రావిడ్ కు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారనే ఊహాగానాలు సాగాయి. వాటన్నింటినీ పటాపంచల్ చేస్తూ బీసీసీఐ ద్రావిడ్ కు జూనియర్లను తీర్చిదిద్దే బాధ్యత అప్పగించింది. ఈ నిర్ణయంపై ద్రావిడ్ తన హర్షం వెలిబుచ్చాడు. తనకున్న అపారమైన అనుభవంతో జూనియర్లను తీర్చిదిద్దుతానని, ఇది ఎంతో కీలకమైన బాధ్యత అని ద్రావిడ్ చెప్పుకొచ్చాడు. మొత్తానికి సీనియర్లలో తనకున్న ప్రాధాన్యత ఎంటో ద్రావిడ్ కి ఇచ్చిన ఈ పోజిషన్ ద్వారా బోర్డు చెప్పకనే చెప్పింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ