అజార్ పై వివాదం రేపుతున్న సీనియర్లు

May 07, 2016 | 03:03 PM | 2 Views
ప్రింట్ కామెంట్
Imraan-azhar-biopic-controversary-niharonline

ఓ గల్లీ క్రికెటర్ గా జీవితం ప్రారంభించి, తన మణికట్టు మాయాజాలంతో విభిన్నమైన క్రికెటర్ గా ఎదిగాడు అజారుద్దీన్. వరుస సెంచరీలతో అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేసిన అజహరుద్దీన్, ఆపై కెప్టెన్ గా బాధ్యతలు నిర్వర్తించాడు కూడా. ఆపై ఫిక్సింగ్ ఆరోపణలు, కెరీర్ ముగించడం అంతా తెలిసిందే. ఇక ఇప్పుడు ఆయన అనుమతితో ఆయన జీవిత కథను సినిమాగా శోభాకపూర్, ఏక్తాకపూర్ తెరకెక్కించారు.

                             ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలో రాబోతున్న ఈ చిత్రం వచ్చే వారం విడుదల కావాల్సి ఉంది. ఇంతలో క్రికెట్ దిగ్గజాలు మనోజ్ ప్రభాకర్, రవిశాస్త్రి, నవ్ జోత్ సింగ్ సిద్ధూ, కపిల్ దేవ్ లు రంగప్రవేశం చేశారు. అజార్ జీవితాన్ని ప్రభావితం చేసిన వారిలో మేం కూడా ఉన్నాం, ఈ సినిమాలో మా పాత్రలను ఎలా చిత్రీకరించారో చూపించాలి, అవసరమైతే మా కోసం ప్రత్యేకంగా ప్రివ్యూ వేయాలని నిర్మాతను కోరారు. అయితే అందుకు నిర్మాత అంగీకరించడం లేదు. ఇకపోతే ఈ సినిమాలో మరో ప్రధాన పాత్ర 'అజార్' రెండో భార్య సంగీతా బిజ్ లానీ తన పాత్రను నెగిటివ్ గా చూపించారని అనుమానిస్తూ మరో వివాదం రేపింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ