ఆ ముగ్గురి జోక్యం అవసరం లేదు

June 16, 2015 | 04:20 PM | 2 Views
ప్రింట్ కామెంట్
ravi_shastri_against_BCCI_advisary_committiee_niharonline

ఆటగాళ్లకు సలహాలతోపాటు సూచనలు కూడా చేసేవాడే కోచ్ అంటే. ఇదే అభిప్రాయంతో ఉన్నాడు భారత్ కు కాబోయే కోచ్ రవిశాస్త్రి. ప్రస్తుతం బంగ్లా పర్యటనలో ఉన్న జట్టుకు డైరెక్టర్ గానే కాకుండా తాత్కాలిక కోచ్ గా కూడా రవి వ్యవహారిస్తున్నాడు. ఈ టూర్ అనంతరం ఆయన రెగ్యులర్ కోచ్ గా మారటం తథ్యంగానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన మదిలో మాటలు ప్రస్తుతం క్రికెట్ అభిమానులను అయోమయంలోకి నెడుతున్నాయి. మ్యాటరేంటంటే... ఇటీవల భారత సీనియర్లు సచిన్, గంగూలీ, లక్ష్మణ్ లను సలహా కమిటీ కి ఎంపికయ్యారు. వారి సేవలను అందుకోవాలని భావించిన బీసీసీఐ వారికి ఆయా కీలక బాధ్యతలను అప్పజెప్పింది. అయితే, ఈ కమిటీపై రవిశాస్త్రి అంతసానుకూలతతో లేనట్లు కనిపిస్తోంది. కోచ్ పనిలో సలహా కమిటీ జోక్యం ఎందుకంటూ ఆయన తన సన్నిహితుల దగ్గర వాదించటం ఈ తరహా వాదనకు బలం చేకూరుస్తోంది. బంగ్లా పర్యటన ముగిసిన వెంటనే రవిశాస్త్రి బోర్డు పెద్దలతో భేటీఅయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. సదరు భేటీలో సలహా కమిటీ జోక్యంపై ఆయన ప్రశ్నలు సంధించే అవకాశాలున్నాయని క్రీడా వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. లెట్ సీ వాట్ హ్యపెండ్

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ