సచిన్, దాదా ఒకే మాట చెప్పారు

September 26, 2015 | 02:25 PM | 2 Views
ప్రింట్ కామెంట్
sachin-ganguly-about-Safari-tour-Tahir-niharonline

త్వరలో సఫారీలతో టీమిండియా తలపడనుంది. ధోనీ నేతృత్వంలోని యువ టీం పూర్తిస్థాయి ఫిట్ నెస్ తో తలపడేందుకు సిద్ధమైపోయింది. ఈ సిరీస్ కు గాంధీ-మండేలా సిరీస్ అని పేరు కూడా పెట్టారు. ఈ నేపథ్యంలో సీనియర్లు జట్టుకు సలహాలు ఇవ్వటం పరిపాటే. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆటగాళ్లను అప్రమత్తం చేశాడు.

సౌతాఫ్రికా జట్టులో ప్రమాదకరమైన ఆటగాళ్లున్నారు అప్రమత్తంగా ఉండాలని సూచించాడు.   అయితే డివిలియర్స్, ఆమ్లా లాంటి డేంజర్ ఆటగాళ్లు ఉండగా సచిన్ మాత్రం ఇమ్రాన్ తాహిర్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సచిన్ సూచించాడు. 36 ఏళ్ల ఈ స్పిన్నర్ కమ్ బ్యాట్స్ మెన్ మోస్ట్ డేంజరస్ వ్యక్తి అని, బ్యాటింగ్ ఎంత బలంగా ఉన్నా అతనిని తక్కువ అంచనా వేయోద్దని చెబుతున్నాడు. ఇక మరో దిగ్గజం గంగూలీ కూడా ఇదే మాట చెబుతున్నాడు. తాహిర్ ను లైట్ తీసుకోవద్దని మాస్టర్ అభిప్రాయంతో ఏకీభవించాడు. సిరీస్ లో భాగంగా ఇరు జట్లు 3 టీట్వంటీలు, 5 వన్డేలు, 4 టెస్టులు ఆడనున్నాయి. టీమిండియా పటిష్ఠంగా ఉందని, జట్టులో అంకిత భావం కలిగిన యువ క్రికెటర్లున్నారని సచిన్ తెలిపాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ