ఈసారి మెరుపులు కష్టమే

April 07, 2016 | 04:41 PM | 1 Views
ప్రింట్ కామెంట్
dashing-players-may-doubt-for-IPL-9-niharonline

మరో రెండు రోజుల్లో ఐపీఎల్ 9వ సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పొట్టి ఫార్మట్ లోని మజాను ఎంజాయ్ చేసేందుకు ఫ్యాన్స్ సిద్ధమైపోతున్నారు. అయితే గత సీజన్ ల మాదిరిగా ఈసారి మెరుపులు ఉండకపోవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. బ్యాటింగ్ మెరుపులతోపాటు బౌలింగ్ విరుపులు కూడా అంతగా కనిపించే అవకాశాలు లేవు.

మోకాలి గాయంతో శ్రీ‌లంక స్టార్ పేసర్ లసిత్ మలింగ ఇటీవ‌ల జ‌రిగిన‌ టీ20 వ‌ర‌ల్డ్‌కప్‌ నుంచి తప్పుకున్న విష‌యం తెలిసిందే. అయితే గాయం నుంచి మలింగ పూర్తిగా కోలుకోలేని కార‌ణంగా ఈ నెల 8న ప్రారంభం కానున్న‌ ఐపీఎల్‌-9 లోనూ పాల్గొనే అవ‌కాశాలు త‌క్కువేన‌ని తెలుస్తోంది. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ తరఫున మలింగ ఆడ‌నున్నాడు.

                       ఇక భారత స్టార్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ కూడా ఐపీఎల్ ఆడేది అనుమానమే. ఆస్ట్రేలియా తో టీ20లోనే యూవీకి గాయమైన సంగతి తెలిసిందే. సన్ రైజర్స్ తరపున యువీ ఆడనున్నాడు. వీరే కాదు విండీస్ డాషింగ్ బ్యాట్స్ మెన్ గేల్, రోహిత్ శర్మ, ధవన్, ఇషాంత్, మాథ్యూస్, మనీష్ పాండే, బజ్జీ ఇలా జాబితా చాలా పెద్దదే ఉంది.  అయితే వీరిలో చాలా వరకు కేవలం ప్రారంభ మ్యాచుల్లో మాత్రమే  పాల్గొన‌క‌పోవ‌చ్చని తెలుస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ