క్రికెట్‌ కురువృద్ధుడి కన్నుమూత

February 26, 2016 | 05:41 PM | 2 Views
ప్రింట్ కామెంట్
cricket-legend-Garudachar-passesaway-niharonline

కర్ణాటకకు చెందిన నాటి తరం క్రికెటర్ బీకే గరుడాచర్(99) ఇక లేరు. శుక్రవారం  రోజు ఉదయం ఆయన తన స్వగృహంలో అనారోగ్యంతో మృతి చెందారు. మైసూర్ కి చెందిన ఆయన తన లెగ్ స్పిన్, గూగ్లీలతో బ్యాట్స్ మన్ కు ముచ్చెమటలు పట్టించేవారు. తన కెరీర్ లో 27 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచుల్లో 100 వికెట్లు తీసుకున్నారు. 29.63 సగటుతో 1126 పరుగులు చేశారు. ఒకే ఇన్నింగ్స్ లో 7 సార్లు 5 వికెట్లు, 3 సార్లు 10 వికెట్లు పడగొట్టిన ఘనత ఆయనది. కాగా, గరుడాచర్ వృత్తి రీత్యా ఇంజనీర్. వెస్ట్రన్ మెట్రోపొలిస్, యునైటెడ్ ప్రావిన్స్ లో పనిచేస్తున్న సమయంలో ఆయన ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడారు. గరుడాచర్ మృతిపై పలువురు సీనియర్ క్రికెటర్లు తమ సంతాపం వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ