ఆధిపత్యం కావాలంటే ఆడాలి కూడా!

June 03, 2015 | 02:49 PM | 1 Views
ప్రింట్ కామెంట్
virat_kohli_bangladesh_tour_about_team_niharonline

ప్రపంచ క్రికెట్ లో టీమిండియా ఆధిపత్యం కనీసం ఐదేళ్లు కొనసాగాలని టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆశాభావం వ్యక్తం చేశాడు. అందుకోసం తమ ప్రయత్నాలు కూడా సరైన రీతిలోనే సాగాల్సి ఉందని అతడు వ్యాఖ్యానించాడు. టీమిండియా ఆటగాళ్లలో నైపుణ్యానికి కొదవేం లేదు. నంబర్ వన్ గా నిలిచే సామర్థ్యం ఎప్పుడూ ఉంటుంది. అందుకే ఈ సమయంలో మన ఆధిపత్యం ఐదేళ్లపాటు కొనసాగాలని కొరుకుంటున్నాను అని మీడియాకిచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఇప్పటిదాకా బాగానే ఉంది కానీ, అసలే కొత్త కెప్టెన్, పైగా దూకుడు తత్వం ఎక్కువ. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆటగాళ్ల నుంచి మద్ధతు కోహ్లీ కి లభిస్తుందంటారా? అయినా మాటలు అనటం కాదు ఆధిపత్యం కావాలంటే ఆడాలి కదా అంటున్నారు క్రీడా విశ్లేషకులు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ