విరాట్-అనుష్క విడిపోవటానికి అసలు కారణం?

February 13, 2016 | 05:59 PM | 2 Views
ప్రింట్ కామెంట్
Virat Kohli asked Anushka Sharma to refuse Sultan niharonline

విరాట్ కోహ్లి, అనుష్క శర్మల లవ్ స్టోరీ యే కాదు, బ్రేక్ అప్ స్టోరీ కూడా బాగానే వార్తల్లోకి ఎక్కింది. కోహ్లీ పెళ్లి ప్రపోజల్ ను అనుష్క తిరస్కరించిందని, కెరీర్ కోసమే ఇద్దరూ ప్రేమకు ఫుల్ స్టాప్ పెట్టారని వార్తలు వచ్చాయి. కానీ, అసలు మ్యాటర్ వేరే ఉందట. విరాట్ కోహ్లీ, అనుష్కలు విడిపోవడానికి 'సుల్తాన్' సినిమానే కారణం అంటున్నాయి సినీ వర్గాలు.

                            పలువురు హీరోయిన్ల పేర్లు పరిశీలించిన తరువాత సల్మాన్ ఖాన్ 'సుల్తాన్' సినిమాలో కథానాయికగా అనుష్కను  ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. సల్మాన్ తో తొలిసారి జతకట్టనున్న అనుష్కకు ఇది భారీ ప్రాజెక్ట్. అయితే విరాట్ కోహ్లీకి మాత్రం అనుష్క ఈ సినిమాలో నటించడం ఇష్టం లేదు. అదే విషయాన్ని ప్రియురాలితో సున్నితంగా చెప్పాడు. కానీ కోహ్లీ జోక్ చేస్తున్నాడని భావించిన అనుష్క సుల్తాన్ సినిమాను అంగీకరించింది. దీంతో ఈసారి కోహ్లీ సీరియస్ గా 'సినిమాల సంగతి పక్కనపెట్టి ముందు ఇంటిని ఎలా నడపాలో నేర్చుకోవడానికి సమయాన్ని కేటాయించు' అంటూ త్వరలో కాబోతున్న వారి వివాహాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పాడని వినికిడి. కోహ్లి మాటలకు గట్టిగానే సమాధానం ఇచ్చింది అనుష్క. అంతే.. వివాదం కాస్తా విడిపోవడానికి దారి తీసింది అని ఓ ప్రముఖ పత్రిక కథనం ప్రచురించింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ