తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ గా తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి నియమితులయ్యారు. ఈ పదవి కోసమే సాధారణ ఎన్నికల్లో పోటీ చేయకుండా చదలవాడ ఓపిక వహించారు. ఇక ఇచ్చిన మాటకు కట్టుబడి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు టీటీడీ చైర్మన్ పదవిని చంద్రబాబుకు కట్టబెట్టారు. చదలవాడకు చైర్మన్ పదవితోపాటు మొత్తం 15 మంది సభ్యులతో కూడిన పూర్తిస్థాయి పాలకవర్గాన్ని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఖరారు చేశారు. బోర్డులో నాలుగు స్థానాలను ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు కేటాయించారు. బీజేపీ ప్రతిపాదించిన అభ్యర్థులతో పాటు తెలంగాణకు చెందిన వారిని కూడా బోర్డులో నియమించినట్లు విశ్వసనీయ సమాచారం. బహుశా ఇది తెలుగు ప్రజలను సమాన దృష్టితో చూస్తున్నాననే సంకేతం పంపేందుకెమో!..