చిన్న తప్పుకే తప్పటడుగు వేసి జీవితాన్నే కోల్పోయాడు

June 17, 2015 | 01:06 PM | 1 Views
ప్రింట్ కామెంట్
thala_asmal_ISIS_niharonline

క్షణికావేశంలో తీసుకున్న ఓ నిర్ణయం అతన్ని తప్పటడుగు వేసేలా చేసింది. ఓ చిన్న ఘటనతో ఇంట్లోంచి పారిపోయి జీవితాన్నే పూర్తిగా మార్చేసుకున్నాడు. ఫలితం ఇప్పుడు చిన్న వయస్సులోనే అర్థాంతరంగా ఆ జీవితాన్ని ముగించాడు. అతడే తలా అస్మాల్. బ్రిటన్ లోని యార్క్ షైర్ ప్రాంతానికి చెందిన ఇతగాడి వయసు పదిహేడేళ్లు. స్కూలు, ఇళ్లు తప్ప వేరే ధ్యాస ఉండేది కాదట. అయితే ఓసారి స్కూల్ లో జరిగిన పరీక్షల్లో తప్పడంతో సిగ్గుతో ఇంటికి వెళ్లలేక పోయాడట. అంతేకాదు తానేందుకు పనికి రానని, ఇక తన లక్ష్యం ఉగ్రవాది కావాలనుకోవటం అని డిసైడ్ అయ్యాడట. అంతే అనుకున్నదే తడవుగా ఇంట్లోంచి పారిపోయి సిరియా వెళ్లి ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ లో చేరాడు. వెనువెంటనే ఉగ్ర శిక్షణ పొంది ఇరాక్ సమీపంలోని బైజీ పట్టణంపై బాంబు దాడులు చేశాడు. ఇక అప్పటి నుంచి ఐఎస్ ఉగ్రవాద సంస్థ అస్మాల్ తో దాడులు చేయించేది. అంతేకాదు ఈ దాడులు చేసింది మావాడే అంటూ అస్మాల్ ఫొటోలను అంతర్జాలంలో పోస్ట్ చేసేది. ఇక వీటిని చూసిన అస్మాల్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించేవారు. అయితే, చివరికి అస్మాల్ జీవితం విషాదంతం అయ్యింది. గత శనివారం అస్మాల్ బాంబు లోడ్ తో ఉన్న ఓ వ్యాన్ తో ఇరాక్ భద్రతా సిబ్బంది కార్యాలయంపై మానవ బాంబు దాడి చేశాడట. ఇలా, చిన్నవయస్సులోనే తన జీవితాన్ని కోల్పోయి ఆ కుటుంబానికి కన్నీటిని మిగిల్చాడు అస్మాల్. ఉగ్రవాద సంస్థల గాలానికి యువత ఆకర్షితులై తమ కన్నవారికి శోకాన్ని మిగులుస్తున్నారనే దానికి ఇదో మరో తార్కాణం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ