ఇప్పటిదాకా శాస్త్రవేత్తల తవ్వకాలలో పురాతన వస్తువులు, అవశేషాలు బయటపడటం మనం చూశాం. ఇంకా కొన్ని పరిశోధనల్లో జంతువులకు సంబంధించిన భాగాలు, వాటి శిలాజాలు దొరకటం కూడా చదివాం. కానీ, ప్రపంచంలోనే తొలిసారిగా మానవుడికి సంబంధించిన ఓ శిలాజాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అతిపురాతనమైన మానవుడి మెదడునోకదానిని బ్రిటిష్ పురాతత్వశాస్త్రవేత్తలు తవ్వకాలలో వెలికితీశారు. దాదాపు 2500 ఏండ్లనాటి మనిషి మెదడుగా భావిస్తున్న దీనిని బ్రిటన్ లోని యార్క్ ప్రాంతంలో కనుగొన్నారు. ప్రపంచలోనే మొట్టమొదటిసారిగా ఇలా తవ్వకాలలో మనిషి భాగానికి చెందిన పురాతన అవశేషం దొరకటం ఇదే ప్రథమం. పూర్తిస్థాయి కపాలంతో ఉన్న ఈ మెదడును 2008 లో జరిపిన తవ్వకాలలో దొరికినప్పటికీ దీనిని పూర్తిస్థాయిలో గుర్తించేందుకు ఇనేళ్లు పట్టింది. పూర్తిగా బురదలో కూరుకుపోయిన ఉండటంతో జాగ్రత్తగా బయటకుతీసి పరిశోధనలు మొదలుపెట్టగా అందులో మెదడు చెక్కుచెదరకుండా ఉందని తేలిపింది. బురద వల్లే ఈ మెదడు పాడవకుండా ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. ఇదే నిజమైతే ప్రస్తుతం మెదడుపై జరుగుతున్న పరిశోధనలు గొప్ప మలుపు తిరుతాయని యార్క్ పురాతత్వ విభాగపు శాస్త్రవేత్త రాచెల్ కుబ్బిట్ తెలిపారు.