మనందరి మామ వయస్సెంతో తెలుసా?

April 18, 2015 | 11:39 AM | 69 Views
ప్రింట్ కామెంట్
earth_satilite_moon_age_apollo_niharonline

భూమ్మీద ప్రతి ఒక్కరితోనూ మామా అనిపించుకునే ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా? అదెనండీ చందమామ. చిన్నప్పుడు పెదరాసి పెద్దమ్మ కథలు, చందమామ కథలు ద్వారా బాగా పాపులర్ అయిన వ్యక్తి లేండి. శాస్త్రవేత్తల దృష్టిలో మన భూమికి ఉన్న ఏకైక ఉపగ్రహాం. ఇక భూమి చుట్టు తిరుగే ఇతగాడి వయస్సు తో తెలుసా? అక్షరాల సుమారు 447 కోట్ల సంవత్సరాలట. సూర్యగోళం ఏర్పడుతున్న క్రమంలో తన సమీపంలోని మరో పాక్షిక గ్రహం మధ్య గురుత్వ బలాల మధ్య విడిపోయిన పదార్థం చంద్రుడిగా ఏర్పడిందని, ఈ పాక్షిక గ్రహాల మధ్య ఉన్న గ్రహశకల బెల్టును భారీ ఖగోళ పదార్థాలు ఢీ కొట్టడంతో వెలువడిన తీవ్రమైన వేడి కూడా చంద్రుడు ఏర్పడటానికి కారణమని శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ ఘటన 447 కోట్ల సంవత్సరాల క్రితం జరిగిందని, అపోలో వ్యోమనౌక తీసుకొచ్చిన పదార్థాల నమునాలను అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు తెలిపారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ