వీఐపీ ఖడ్గమృగం... 24/7 జడ్ ఫ్లస్ భద్రత

April 22, 2015 | 11:58 AM | 19 Views
ప్రింట్ కామెంట్
white_rhino_protected_by_guards_niharonline

ఓ ఖడ్గ మృగం... దానికి జడ్ ప్లస్ కేటగిరి స్థాయిలో భద్రత. 24 గంటలూ తుపాకులతో సాయుధ బలగాలు దానికి కాపలా కాస్తుంటాయి. ఓ ఖడ్గ మృగానికి అంతసీనేందుకంటారా? అది అలాంటిది ఇలాంటిది కాదండోయ్. అది ఒక్కగానోక్క మగ తెల్ల ఖడ్గ మృగం. సాధారణ పరిస్థితులలో అయితే దానికి ఎవరి కాపలా... రక్షణా అవసరం లేదు. కానీ స్మగ్లర్ల నుంచి ప్రమాదం పొంచి ఉండటంతో దానికిలా భారీ భద్రత కలిపించారు. దానిని కాపాడుకోవడానికి సూడాన్ ప్రభుత్వం ఇలా జడ్ ప్లస్ రక్షణ కల్పించింది. ప్రపంచంలో అంతరించి పోతున్న జంతువులలో తెల్ల ఖడ్గ మృగాలు కూడా ఉన్నాయి. ఇప్పటిదాకా ఇవీ కేవలం 5 మాత్రమే మిగిలాయి. ఇక వీటిలో మిగిలిన ఏకైక తెల్ల మగ ఖడ మృగం ఇదోక్కటే.  సంతతి అభివృద్ధి చెందాలంటే తెల్ల మగఖడ్గ మృగమొక్కటే మార్గం. దానికి ఏమైనా అయ్యిందో ఇక తెల్ల ఖడ్గమృగాల వంశం అంతరించినట్లే. చివరికి కొమ్ము వల్ల కూడా ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనన్న భయంతో దాన్ని కోసేశారు కూడా.   ఆసియా దేశాలలో వీటి అవయవాలకు, మాంసానికి భళే గిరికీ ఉంది. దాని ద్వారా అనేక రోగాలు నయమవుతాయనే ఏకైక కారణంగా స్మగ్లర్లు వాటిని వేటాడి చంపి కోట్ల సొమ్ము చేసుకుంటున్నారు. అందుకే 24 గంటలూ కంటికి రెప్పలా దానిని కాపాడుకుంటున్నారు.  సాధారణంగా వీటి జీవిత కాలం 50 సంవత్సరాలు. ఇప్పుడు దీని వయస్సు 43 ఏళ్లు. దీంతో ఈ 7 సంవత్సరాలలోనే దీని సంతతిని అభివృద్ధి చేయాలని నిర్వాహకులు చూస్తున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ