హానికరమని చెప్పనందుకు చెల్లించుకున్నారు భారీ మూల్యం

June 02, 2015 | 03:18 PM | 1 Views
ప్రింట్ కామెంట్
canada_court_ordered_tobacco_companies_billion_damages_to_victim_smoking_niharonline

17 ఏళ్లుగా పోరాడిన ఆ కేసులో వారంతా విజయం సాధించారు. వాదోపవాదనలు విన్న కోర్టు రూ.750 కోట్ల రూపాయలను నష్టపరిహారంగా చెల్లించాలని తీర్పునిచ్చింది. ఇంతకీ ఇంత పెద్ద నష్టపరిహారం ఎవరు గెలిచారు... దేనిపై అనేగా?. 1998 లో కొంత మంది కెనడాలోని కుబెక్ ప్రావిన్స్ సుపీరియర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వారంతా సంవత్సరాల తరబడి సిగరెట్లు తాగుతూ, వివిధ ప్రాణాంతక రోగాల బారిన పడిన వారే. తాము సిగరెట్లకు బానిసలమై ఆరోగ్యాలను చెడగొట్టుకున్నామని, అందుకు సిగరెట్లు తయారుచేసిన కంపెనీలదే బాధ్యత అని వారంతా ఆరోపించారు. కేసును క్షుణ్ణంగా పరిశీలించిన న్యాయస్థానం ఓ నాలుగైదు టాప్ కంపెనీలు తప్పు చేశాయని పేర్కొంది. బాధితులకు 12 బిలియన్ల డాలర్ల (మన కరెన్సీలో దాదాపు రూ.750 కోట్లు) చెల్లించాల్సిందేనని ఆదేశించింది. వాస్తవానికి కెనడాలో పొగాకు ఉత్పత్తులపై ఎలాంటి నిషేధాలూ లేవు. పొగతాగడం హానికరం అన్న నినాదం పెట్టెపై ఉండాలని, అటువంటి హెచ్చరికలు జారీ చేయనందువల్ల బాధితుల అనారోగ్యానికి కంపెనీలదే బాధ్యత అని అభిప్రాయపడ్డ న్యాయమూర్తి, ఈ భారీ పరిహారాన్ని అందించాలంటూ తీర్పిచ్చారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ