మరణించినా ఆ మృగరాజు వదలనంటోంది!

July 29, 2015 | 03:06 PM | 4 Views
ప్రింట్ కామెంట్
Cecil_lion_killed_pamar_story_niharonline

జింబాబ్వేలోని హవాంగే నేషనల్ పార్కులో చోటుచేసుకున్న ఓ ఉదంతం ఇప్పుడు మనిషన్నవాడిని ఎవడినైనా కదిలించివేస్తుంది. 13 సంవత్సరాల వయస్సున్న సిసిల్ అనే ఓ సింహాన్ని వేటాడి చంపిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. డబ్బులు చెల్లించి మరీ ఓ దుర్మార్గుడు దానిని కర్కశంగా వేటాడి చంపాడు. వివరాల్లోకి వెళ్లితే... సిసిల్ అనే సింహం పుట్టినప్పటి నుండి పార్క్ కి వస్తున్న వేలాది మంది ఆకర్షిస్తూ వస్తుంది. పామర్ అనే అమెరికాకు చెందిన ఓ డాక్టర్ పార్క్ కన్ను ఆ సింహం పై పడింది. నిర్వాహకులకు 50 వేల డాలర్లు చెల్లించి దీనిని వేటాడేందుకు అనుమతి తీసుకున్నాడు. దానిని చూసిన వెంటనే ఓ బాణాన్ని సంధించాడు. అయితే బాణం తలిగిన అది చనిపోలేదు. ఆ బాధను అనుభవిస్తూ దాని పిల్లల దగ్గరికి వెళ్లి కూర్చుంది. ఇక పార్క్ అధికారులు దానికోసం వెతుకులాడి దానిని చంపి ముక్తిని ప్రసాదించారట.  ఇక ఈ తతంగం వీడియోలు, ఫోటోల రూపంలో సోషల్ మీడియాల్లో అప్ లోడ్  కావటంతో పామర్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై నెటిజన్లు ఆ వైద్యుడిపై దుమ్మెత్తి పోస్తున్నారు. థ్రిల్ అని చెప్పుకుంటూ అతను చేసిన రాక్షస క్రీడకు అతన్ని తీవ్రంగా శిక్షించాలని కొరుతున్నారు. అంతేకాదు సొంత దేశం నుంచి అతగాడిపై తిట్లపురాణాలు పడుతున్నాయి. అతనో అమెరికన్ అని చెప్పుకునేందుకు మేమంతా సిగ్గుపడుతున్నామని, నిజమైన మృగం పామరే అని అమెరికన్లు కూడా ట్వీట్ చేస్తున్నారు. సిసిల్ ది లయన్ పేరిట ఇప్పడీ టాపిక్ నెట్ లో హాల్ చల్ చేస్తుంది. చనిపోయాక కూడా సిసిలి గర్జిస్తూ పామర్ ను శిక్షించాలని కోరుకుంటుందన్నమాట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ