అద్భుతం: 9 రోజులు 5,500 కి.మీ. డ్రైవర్ లేకుండానే...

April 06, 2015 | 11:05 AM | 99 Views
ప్రింట్ కామెంట్
driverless_car_delfi_niharonline

బ్రిటన్ కు చెందిన ఆటోమొబైల్ కంపెనీ డెల్ఫీ బ్రుందం చరిత్ర స్రుష్టించింది. ఈ సంస్థ తయారు చేసిన డ్రైవర్ లేని కారు అమెరికాలోని 15 రాష్ట్రాల మీదుగా 9 రోజులపాటు మొత్తం 5,500 కి.మీ. ప్రయాణించింది. మార్చి 22న శాన్ ఫ్రాన్సిస్కో నుంచి బయలుదేరిన కారు కాలిఫోర్నియా మీదుగా న్యూయార్క్ నగరానికి చేరుకుని డ్రైవర్ లెస్ కార్ల ఆలోచన సాకారం దిశగా మరో మైలురాయిని అధిగమించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఝానంతో తయారైన ఈ కారులో ఆరు దూర శ్రేణి రాడార్లు, నాలుగు స్వల్ఫ శ్రేణి రాడార్లు, మూడు కెమెరాలు, ఆరు లిడార్ సెన్సార్లు అమర్చారు. అధునాతన అల్గారిథం సాఫ్ట్ వేర్, అత్యాధునిక డ్రైవ్ అసిస్టెన్స్ సిస్టమ్స్ కారు ఎటువంటి ప్రమాదం జరగకుండా కాపాడుతాయి. ఇక వీటిపై ఉన్న చట్టపరమైన అడ్డంకులు తొలగిపోతే, డ్రైవర్ లేని కార్లు రోడ్ల మీద చక్కర్లు కొడతాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ