బగ్ ను కనిపెట్టిన భారతీయుడికి బహుమతిచ్చిన ఫేస్ బుక్

February 14, 2015 | 10:43 AM | 42 Views
ప్రింట్ కామెంట్
FB_pays_indian_money_for_finding_bug_niharonline

అకౌంట్ నుంచి ఫోటోలను తొలగించే బగ్ ను కనుగొన్న భారతీయుడికి ఫేస్ బుక్ బహుమతి అందజేసింది. కొద్దిపాటి టెక్నికల్ నాల్డెజ్ ఉన్న ఎలాంటివారైనా కూడా ఫేస్ బుక్ లో అప్ లోడ్ అయిన ఎలాంటి ఫోటోలనైనా డిలీట్ చేసేలా ఉన్న ఓ బగ్ ను లక్ష్మణ్ ముత్తయ్య అనే యువకుడు గుర్తించాడు. దాని గురించి పేస్ బుక్ వినియోగదారులను హెచ్చరిస్తూ తన బ్లాగులో సవివరంగా ఓ వ్యాసం రాశాడు. అది పోస్టయిన కాసేపట్లోనే ఫేస్ బుక్ దాన్ని సవరించింది. వేరే ఎవరివో ఫోటో ఆల్బంను డిలీట్ చేయడానికి గ్రాఫ్ ఏఐపీకి రిక్వెస్ట్ పంపితే, దానిని ఫేస్ బుక్ ఆమోదించి, ఆల్బం మొత్తాన్ని డిలీట్ చేస్తుందని ముత్తయ్య వెల్లడించాడు. ఆల్బం ఐడీలు అంకెల్లో ఉంటాయని, కాబట్టి ఆ ఆంకెలను ఊహించటం సులువైపోతుందని, దీని కారణంగా తెలియని వారి ఆల్బంను కూడా డిలీట్ చేయోచ్చని ఐటీ సెక్యూరిటీ కంపెనీ సోఫాస్ తెలిపింది. కాగా, ఈ బగ్ కేవలం పబ్లిక్ ఆల్బంను మాత్రమే నాశనం చేస్తోందని, పర్సనల్ ఆల్బంకు వర్తించదని ఫేస్ బుక్ చెబుతోంది. ఇక ఈ బగ్ ను కనుగొన్నందుకు ముత్తయ్యకు రూ.7.77 లక్షల రూపాయల నజరానాను అందజేసింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ