మనిషి వ్యసనాలకు అలవాటు పడితే ఎంత డేంజరో ఇప్పుడు మీరు చదవబోయే ఈ సంఘటనే తెలియజేస్తుంది. అది 2014, ఆగష్టు నెల... జర్మనీలోని బెర్లిన్ కు చెందిన ఓ యువకుడు తన ఇంట్లో స్నేహితుడితో కలిసి వీడియో గేమ్ ఆడుతున్నాడు. ఆ సమయంలో అతడి గర్ల్ ఫ్రెండ్ అక్కడికి వచ్చింది. అయితే ఆటలో అప్పటిదాకా ఉన్న ఆ యువకుడు ఒక్కసారిగా ఆగిపోయాడు. ఒకవేళ తన ఆటకు గర్ల్ ఫ్రెండ్ అడ్డు తలిగితే ఎలా అని ఆలోచించాడు. వెంటనే ఓ ఉపాయం పన్నాడు. ఆమెకిచ్చిన టీ లో మత్తుమందు కలిపాడు. దాంతో ఆమె హాయిగా కునుకు తీసింది. తర్వాతి రోజు మధ్యాహ్నానానికి గానీ లేవలేదట. ఆ తర్వాత జరిగింది తెలుసుకుని అతనిపై కోర్టులో కేసు వేసిందట. మత్తుమందు కలపడంలో దురుద్దేశం లేనప్పటికీ, ఆమెపై అది చెడు ప్రభావం చూపనప్పటికీ కోర్టు మాత్రం ఆ ప్రేమికుడికి 500 యూరోల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించిందట. ఆటకు అడ్డుతలుగుతుందన్న ఆలోచనతో అతడు చేసిన పనికి ఇప్పుడు చచ్చినట్లు ఫైన్ చెల్లించాల్సి వచ్చింది.