ఇకపై ‘ఆ’ సైట్లు చూడాలంటే అనుమతి తప్పనిసరి

June 20, 2015 | 01:10 PM | 9 Views
ప్రింట్ కామెంట్
google_introduces_porn_revenge_for_search_results_niharonline

గూగుల్ సెర్చ్ ఇంజన్ మన నిత్యజీవితంలో ఎంతగా ముడిపడిపోయేందో తెలిసిన విషయమే. ఏ చిన్న విషయాన్ని శోధించాలన్న గూగుల్ ను ఆశ్రయించటం నెటిజన్లకు అలవాటయిపోయింది. అయితే ఇకపై అదే గూగుల్ లో అశ్లీల దృశ్యాలను వీక్షించాలనుకునేవారికి పెద్ద చిక్కు రాబోతుంది. వారు తప్పనిసరిగా గూగుల్ సెన్సార్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందట. గూగూల్ యాజమాన్యం దీనికి సంబంధించి ఇప్పటికే ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. వీక్షకులతోపాటు అశ్లీల దృశ్యాలు అప్ లోడ్ చేసే వారికి కూడా ఈ నిబంధన వర్తించబోతుందట. దీనికోసం సెన్సార్ షిప్ ఫామ్ ఒకటి గూగుల్ సెర్చ్ ఇంజన్ లో త్వరలో దర్శనిమివ్వనుంది. అంతేకాదు మరి కొద్ది వారాల్లో ఈ విధానం ఆచరణలోకి రానున్నట్లు తెలుస్తోంది.  ఒకవేళ గూగుల్ లో సెన్సార్ విధానం అమలైతే బూతు సైట్లు చూద్దామనుకునే వీక్షకులకు ఇబ్బందులు ఎదురవ్వటంతోపాటు  ఇప్పటికే అనధికారంగా ఉన్న అశ్లీల దృశ్యాలు కనుమరుగయ్యే అవకాశం ఉంది. పైగా అనుమతులు లేకుండా ఇష్టమొచ్చినట్లు పోర్న్ వీడియోలు అప్ లోడ్ చేసే ఆకతాయిలకు అడ్డుకట్ట వేసినట్టు అవుతుంది. అయితే ఇలా ముందస్తు వార్నింగ్ ఇవ్వటం వల్ల జాగ్రత్త పడి ముందుగానే డౌన్ లోడ్ చేసుకునే వాళ్లు కూడా లేకపోలేరు కదా.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ