బాగు చేస్తానని బ్యాంకుల్లో బ్లాక్ మనీ దాచుకున్నాడు

February 23, 2015 | 03:57 PM | 79 Views
ప్రింట్ కామెంట్
Stuart_Gulliver_Swiss_account_niharonline

బ్యాంకింగ్ రంగంలో షాకింగ్ కలిగించే వార్త ఒకటి బయటపడింది. కుంభకోణాల్లో కూరుకుపోయి, దారుణంగా నష్టాల్లో ఉన్న సంస్థను సంస్కరిస్తానని హెచ్ఎస్ బీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టువార్ట్ గలివర్ ఇన్నాళ్లుగా చెబుతూ వస్తున్నాడు. అయితే ఆయనలోని చీకటి కోణాన్ని బ్రిటన్ పత్రిక ది గార్డియన్ ఇఫ్పుడు బయటపెట్టింది. వాస్తవానికి ఆయనగారు స్విస్ బ్యాంకులో కోట్ల కొద్దీ రూపాయలను దాచుకున్నాడట. మే నెలలో బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో ఇది అక్కడి ప్రభుత్వానికి పెద్ద శరాఘాతంగానే పరిణమిస్తుందని గార్డియన్ కథనం ప్రచురించింది. పన్నుల ఎగవేత కోసమే గలివర్ 2007 సంవత్సరంలో రూ. 47.26 కోట్లను పనామాలో రిజిస్టర్ అయిన ఓ కంపెనీ పేరుమీద స్విస్ బ్యాంకులో దాచుకున్నట్లు తెలిసింది. స్వతహాగా బ్రిటన్ కు చెందిన గలివర్, తన న్యాయపరమైన, పన్ను అవసరాల కోసం హాంకాంగ్ లో ఉంటున్నారు. అయితే ఈ వ్యవహారంపై స్పందించేందుకు హెచ్ఎస్ బీసీ వర్గాలు నిరాకరించాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ