ధనిక దేశంలో ఫ్రీగా పేదల కడుపు నింపుతున్న భారత రెస్టారెంట్

April 14, 2015 | 03:08 PM | 54 Views
ప్రింట్ కామెంట్
free_food_by_indian_restuarant_for_coolies_in_dhoha_niharonline

అరబ్ సామ్రాజ్యంలో భాగమైన ఖతార్ రాజధాని దోహా. ఎటుచూసినా ఖరీదైన భవనాలు, రోడ్లపై విలాసవంతమైన కార్లు తిరుగుతూ నిత్యం బిజీగా ఉంటుంది. అక్కడికి సుమారు 16 కి.మీ. దూరంలో మట్టి కోట్టుకుపోయిన రోడ్లు, పలు చిన్నమధ్య తరహా పరిశ్రమలు ఉంటాయి. బతుకుదెరువు కోసం భారత్ వంటి దేశాల నుంచి వచ్చిన వలస కూలీలకు తక్కువకు ఆశ్రయం, ఆసరా దొరికేవి అక్కడే. అక్కడో రెస్టారెంట్ ఉంటుంది. దాని బోర్డుకు... ‘‘మీకు ఆకలిగా ఉంటే రండి.. డబ్బు లేకపోయినా సరే, ఉచితంగా తినండి’’ అన్న బోర్డు కనిపిస్తుంది. కేవలం 16 మంది మాత్రమే కూర్చునే వీలున్న రెస్టారెంట్ ను మూడు వారాల క్రితం ఇద్దరు భారతీయ సోదరులు షాదాబ్, నిషాబ్ ఖాన్ లు స్ట్రీట్ 23 పేరిట ప్రారంభించారు. ఇక్కడి కార్మికులకు ఉచితంగా ఆహారం అవసరం. ఈ ఆలోచన నా తమ్ముడి మనసులో నుంచి వచ్చింది అని గర్వంగా చెబుతున్నాడు షాదాబ్. ఇక్కడి వచ్చే మన భారతీయ కూలీలు ఆత్మగౌరం ఉన్నవారు. ఉచితంగా తినమన్న ఎంతో కొంత చెల్లించి వెళ్తుంటారు. ఇంకొందరయితే కొంచెం బ్రెడ్ మాత్రమే తీసుకుని, కడుపు నిండా నీరు తాగి పోతుంటారని, వారిని చూసినప్పుడు తనకు కన్నీళ్లు వస్తాయని షాదాబ్ చెబుతున్నాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ