ఉపవాసం పాటించలేదని పిల్లలను పాశవికంగా చంపారు

June 23, 2015 | 01:16 PM | 9 Views
ప్రింట్ కామెంట్
isis_killing_children_in_syria_ramzan_breaking_niharonline

రంజాన్ మాసం పవిత్రతకు చిహ్నాం. ఐఎస్ఐఎస్ లాంటి తీవ్ర వాద సంస్థ కూడా దీనిని అనుసరించటం ఆశ్చర్యకరమే. కానీ, ఈ పవిత్ర నెలలో కూడా వారు అమాయకులపై అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా సిరియాలో జరిగిన ఓ ఘోరం వారి రాక్షసత్వానికి పరాకాష్ట. రంజాన్ మాసం జరుగుతుండగా, పగటి పూట ఆహారం తీసుకున్నారని ఆరోపిస్తూ ఇద్దరు పిల్లలను ఐఎస్ ఉగ్రవాదులు ఉరితీశారు. హిస్బాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. వీరిద్దరి వయస్సు 15 సంవత్సరాల లోపేనని సిరియా మానవ హక్కుల కార్యకర్త ఒకరు చెప్పారు. అనాథలైన వారిద్దరు ఆకలితో అలమటిస్తూ... సరిగ్గా ఆహరం తీసుకుంటున్న సమయంలోనే ఉగ్ర రాక్షసులకు చిక్కారు. దీంతో మత నిబంధనలను పాటించలేదంటూ వారిని ప్లకార్డులతో ఉరేగించారు. అనంతరం సోమవారం వారిద్దరినీ ఉరితీసి, ఆదేహాన్ని రాత్రి వరకు అలానే ఉంచారని సమాచారం. రంజాన్ లో వీరు రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తే,,, మరి వీరిని అల్లా కూడా క్షమిస్తాడో లేదో?  

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ