మనసారా ఏడవాలనుందా? అయితే అక్కడికి వెళ్లండి

May 07, 2015 | 04:13 PM | 35 Views
ప్రింట్ కామెంట్
japan_crying_rooms_in_hotel_niharonline

మనస్ఫూర్తిగా గట్టిగా ఏడవాలని ఉందా? అయితే మీ కోసం ఓ ప్రత్యేక ఏర్పాటు ఉందండీ. జపాన్ లోని ఓ వినూత్న హోటల్ ముస్తాబైంది. ఇక్కడ ఎంపిక చేసిన కొన్ని గదులకు వెళ్లితే ఏడుపు ఆటోమేటిక్ గా వచ్చేస్తుందట. టోక్యోలోని మిత్సుయ్ గార్డెన్ యోత్సుయా అనే పేరున్న హోటల్ లో మహిళల కోసం, అందులో స్పెషల్ గా ఏడ్చేవారి కోసం క్రైయింగ్ రూమ్స్ సిద్ధం చేశారు. ఈ రూముల్లో  కన్నీరు పెట్టించే విషాద చిత్రాలు. పెల్లుబికిన కన్నీటిని తుడుచుకునేందుకు లగ్జరీ టిష్యూలు లగ్జరీ టిష్యూలు తదితర సౌకర్యాలు కల్పిస్తారట. ఈ గదుల్లో ఉండేందుకు రోజు ఛార్జీ సుమారు 83 డాలర్లు అంటే మన కరెన్సీలో 5,300. ఇక్కడ ఆపర్ చేసే చిత్రాల్లో ఫారెస్ట్ గంప్, ఏ టేల్ ఆప్ మారీ, త్రీ పప్పీస్ తదితరాలుంటాయట. 2004 జపాన్ భూకంపంలో తన మూడు కూనలనూ రక్షించుకున్న శునకం కథే ఇది. అంతేకాదు ఏడిస్తే మేకప్ పోతుందనే భయం ఉన్న మహిళల కోసం ప్రత్యేక సదుపాయం కూడా ఇక్కడ కల్పించారు. అదేనండీ మేకప్ రిమూవర్ లను కల్పిస్తారట. అదండీ మ్యాటర్. ఏడవాలనుకుంటున్నారా? అయితే ఛలో జపాన్.   

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ