విడిపోయేందుకు వీలు కల్పిస్తున్న ఫేస్ బుక్

April 07, 2015 | 05:27 PM | 128 Views
ప్రింట్ కామెంట్
facebook_divorce_niharonline

ఒకరితో ఒకరు కలిసేందుకు సహకరిస్తున్న సామాజిక మాధ్యమాలు ఇకపై విడిపోవడానికి వారధిగా నిలవనున్నాయి. ఎక్కడున్నాడో తెలియకుండా కేవలం ఫేస్ బుక్ ద్వారా టచ్ లో ఉన్న భర్తకు విడాకుల నోటీసు పంపేందుకు మాధ్యమంగా పంపేందుకు అమెరికాలోని మాన్ హటన్ కోర్టు అనుమతి ఇచ్చింది. యూఎస్ లో నర్సుగా విధులు నిర్వహిస్తున్న ఎలనొరా అనే యువతి 2009లో విక్టర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కొంతకాలం తర్వాత ఎవరీకి చెప్పకుండా వెళ్లిపోయిన విక్టర్, ఫేస్ బుక్ ద్వారా అప్పుడప్పుడు ఆమెతో టచ్ లో ఉంటున్నాడు. భర్త నుంచి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్న ఎలనొరా నోటీసులు పంపేందుకు ఎంతగా ప్రయత్నించినప్పటికీ అతని చిరునామా దొరకలేదు. దీంతో కోర్టును ఆశ్రయించగా ఫేస్ బుక్ ద్వారా విడాకుల నోటీసు పంపేందుకు న్యాయమూర్తి మాథ్యూ కూపర్ అంగీకరించాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ