ఆయనో దేశానికి మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం నషీద్ మాల్దీవుల చట్టసభలో ప్రతిపక్ష హోదాలో కొనసాగుతున్నారు. అయితే ఏంటి తొక్క అనుకున్నారేమో పోలీసులు కింద పడేసి పిచ్చి కొట్టుడు కొట్టారు. ఆయనే మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్.. ఉగ్రవాదానికి సంబంధించిన కేసులో ఆయనను పోలీసులు కొద్దిరోజుల క్రితం అరెస్ట్ చేశారు. అయితే ఆయనను ఏ నేరంపై అరెస్ట్ చేశారనే విషయం మాత్రం పోలీసులు స్పష్టత ఇవ్వటం లేదు. ఇక ఈ కేసుకు సంబంధించి సోమవారం ఆయనను కోర్టుకి పోలీసులు తీసుకొచ్చారు. తీసుకురావటం అలా ఇలా కాదు. కింద పడేసి కాళ్లతో తన్నారు. చావబాదారు. ఈ ఘటనలో ఆయన ముంజేయి ఎముక విరిగింది. అయినా సరే ఆయనను లోపలికి ఈడ్చుకుంటూ లోపలికి తీసుకెళ్లారు. ఇక లోపలికెళ్లాక న్యాయమూర్తి కూడా ఆయన పరిస్థితి చూసి కనికరించకపోగా, విచారణ పూర్తయ్యే వరకు పోలీస్ కస్టడీలో ఉంచాలని ఆదేశించారు. అంతేకాదు ఆయన వ్యక్తిగత లాయర్ ను కూడా కలవనీయలేదు. కాగా, ఈ ఘటనపై భారత్ తప్ప ఏ దేశం కూడా స్పందించకపోవటం గమనార్హం. మరికొన్ని రోజుల్లో ప్రధాని మోదీ మాల్దీవుల్లో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా జరిగాయి. ఇక దీనిపై మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. నషీద్ పై దాడి దురద్రుష్టకరమని, ఆయనపై విచారణ నిష్పక్షపాతంగా జరగాలని మోదీ కోరారు. కానీ, ఒకప్పుడు వారిచేతుల మీదుగా సెల్యూట్ అందుకున్న ఆయన పరిస్థితి ఇప్పుడు ఎంతదారుణంగా తయారయ్యిందో కదా. అదే మన దేశంలో అయితే ఎంతటి క్రైం లు చేసే వాడికైనా వీఐపీ ట్రీట్ మెంట్ లు వగైరా. ఎంతైనా గొప్ప నైతిక విలువలున్న దేశం కదా మనది. మేరా భారత్ మహాన్.