భూకంప భీభత్సం @6,200 : అంతకంతకు పెరుగుతున్న మృతదేహాలు

May 01, 2015 | 03:48 PM | 125 Views
ప్రింట్ కామెంట్
nepal_earth_quake_death_toll_raise_niharonline

నేపాల్ భూకంపం వచ్చి ఇప్పటికి ఆరురోజులు అయిపోయింది. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంటుంది. ఇప్పటిదాకా మరణించిన వారి సంఖ్య 6,200 కు చేరింది. 13,900 మందికి గాయాలయ్యాయి. కాగా, నిరంతరం కొనసాగుతున్న సహాయక చర్యల్లో 128 గంటల తర్వాత ఓ మహిళ సజీవంగా బయటపడింది. అలాగే  ఓ నాలుగు నెలల బుడతడిని మాత్రం ఈ భూకంపం ఏం చేయలేకపోయింది. సోనిత్ అవల్ అనే నాలుగు నెలల బుడతడు నేపాల్ భూకంపం నుండి క్షేమంగా బయటపడ్డాడు. సహాయ చర్యల్లో పాల్గొన్న సిబ్బంది ఓ ఇంటి శిథిలాలు తొలగిస్తుండగా ఈ నాలుగు నెలల పసిపిల్లాడు బయటపడ్డాడు. 22 గంటల పాటు శిథిలాల కింద ఉన్నా కూడా బాలుడు సురక్షితంగా ఉండటంతో అందరూ ఆనందం వ్యక్తం చేశారు. మరోవైపు భారత్ చైనాలు సహాయక చర్యల్లో ముందున్నాయి. భారత్ తరపున చర్యలను పర్యవేక్షించేందుకు విదేశాంగ కార్యదర్శి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు దోవల్ లు అక్కడికి చేరుకున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ