కో పైలట్ ఉదంతంపై రగిలిపోతున్న ఆ రెండు దేశాలు...

March 27, 2015 | 03:40 PM | 46 Views
ప్రింట్ కామెంట్
Germanwings_plane_crash_niharonline

జర్మన్ వింగ్స్ విమానం కో-పైలెట్ విద్రోహ చర్యవల్లే కూలిపోయిందని తెలుసుకున్న జర్మనీ, స్పెయిన్ వాసులు కోపంతో రగిలిపోతున్నారు. ఒక్కడి ఆత్మహత్య 149 మంది అమాయకుల ప్రాణాలను బలిగొందని, దీనికి బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నిస్తూ.. నిరసన ప్రదర్శనలకు దిగుతున్నారు. దుర్ఘటన వెనుక తాజాగా వెలుగులోకి వచ్చిన కొత్త కొణం ఏమాత్రం ఊహించలేనిదని జర్మనీ ఛాన్స్ లర్ ఎంజిలా మెర్కెల్ వ్యాఖ్యానించారు. ఈ వార్త విని వణికిపోయానని, బాధితుల బంధు మిత్రులకు అండగా ఉంటామని స్పెయిన్ ప్రధాని మారియానో రజొయ్ తెలిపారు. విమానం కూలే క్షణాల ముందు వరకూ ప్రయాణికులకు జరుగుతున్నది ఏమిటో తెలియదని ఫ్రెంచ్ అధికారి వివరించారు. స్కూల్ ఎక్సేంజి కార్యక్రమానికి వెళ్లి వస్తున్న 16 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు ఈ ప్రమాదంలో మరణించారు. వీరి స్కూల్ లో విషాద ఛాయలు నెలకొన్నాయి. జరిగిన ఘటన తమకు చాలా ఆగ్రహాన్ని కలిగిస్తోందని, కలవరపెట్టిందని స్కూల్ ప్రిన్సిపాల్ అన్నారు. ఈ కోపం ఎవరిపై చూపాలో తెలియటం లేదని అన్నారు. మ్రుతుల బంధువుల నుంచి వస్తున్న విమర్శలుక సమాధానం ఎలా ఇవ్వాలో తెలియక అధికారులు తలలు పట్టుకున్నారు. పరిస్థితి అదుపుతప్పకుండా చూసేందుకు చర్యలు చేపట్టారు.  

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ