మనిషి మీద మనిషికి నమ్మకం పోయింది. అందుకే మర మనుషుల (రోబోల) మీద పడ్డాడు. ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే దాకా మనిషికి అవసరమైన పనులన్నింటినీ వాటికి నేర్పించి వాడుకుంటున్నాడు. కానీ, మనుషుల్లో ఇప్పుడు అవి కూడా తమ నమ్మకాన్ని కోల్పోతున్నాయి. రోబో సినిమాను తలపించే ఓ ఘటన జర్మనీ లో జరిగింది. బౌనటాల్ ప్రాంతంలోని వోక్స్ వాగన్ కార్ల కంపెనీ తయారీ ఫ్యాక్టరీలో సోమవారం రోబో ఓ మనిషిని హతమార్చింది. అక్కడ విడిబాగాలను అమర్చే ఆ రోబో 22 ఏళ్ల ఓ యువకుడిని ఎత్తి పక్కనే మిషన్ లో పెట్టి పచ్చడి పచ్చడి చేసిందట. ఘటనలో ఆ యువకుడి అవయవాలేవీ మిగలకుండా నుజ్జు నుజ్జు అయ్యాయట. ఈ ప్రమాదం మానవ తప్పిదం వల్లే జరిగిందని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. సాధారణంగా ఆ రోబోలు పనిచేసే స్థలంలో మనుషులు ఉండరట. కానీ, ఆ యువకుడి టైం బాగోక అక్కడ ఉండటంతోనే ఈ ఘటన చోటుచేసుకుందని ఆయన తెలిపారు. ఎంతైనా మనుషులు చేసిన బొమ్మలు కదా. ప్రమాదకరంగా మారటం వెనుక కూడా మానవ తప్పిదాలే ఉంటాయన్నది అక్షరసత్యం.