మానవత్వం గెలిచింది: చిన్నారి కోసం తలపాగా తీశాడు

May 17, 2015 | 10:34 AM | 32 Views
ప్రింట్ కామెంట్
sikh_man_remove_turban_niharonline.jpg

అవును, మానవత్వం ముందు మతం చిన్నబోయింది. ఏ సిక్కూ చేయడానికి సాహసించని పనిచేసిన తన మానవత్వాన్ని చాటుకుని అందరిచేతా శభాష్ అనిపించుకున్నాడో యువకుడు. ఈ ఘటన న్యూజిలాండ్ లోని అక్లాండ్ లో చోటుచేసుకుంది. 23 ఏళ్ల హర్మన్ సింగ్ తన ఇంట్లో ఉండగా బయట ఓ కారు యాక్సిడెంట్ జరిగింది. అందులో ఓ ఐదేళ్లబ్బాయికి తీవ్ర రక్తస్రావం అవుతుండగా, మరో ఆలోచన లేకుండా తన టర్బన్(తలపాగా) తీసి కట్టుకట్టాడు. ఆ సమయంలో తాను సంప్రదాయం గురించి చూడలేదని, కేవలం జరిగిన ప్రమాదాన్ని, ఆ చిన్నారి అవస్థను మాత్రమే చూశానని హర్మన్ చెబుతున్నాడు. ఈ మొత్తం ఘటనను అక్కడి హెరాల్డ్ పత్రిక ప్రత్యేక కథనంగా ప్రచురించింది. అంతేకాదు అక్కడున్న ఓ యువకుడు ఆ మంచిపనిని వీడియో తీసి సోషల్ మీడియలో పెట్టాడు. రోడ్డు మీద వెళ్తుంటే మనకెందుకులే అనుకునే రోజుల్లో,  విమర్శలు చెలరేగుతాయని తెలిసి కూడా ఆ యువకుడు చేసిన పని కొందరికి నచ్చకపోయినా  మనం మాత్రం అభినందించాల్సిందే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ